Posts

Showing posts from November, 2012

నీ కోసం... నీ ప్రేమ కోసం....

Image
నే ఎదురుచూస్తున్నా....  చూస్తూనేఉన్నా ... నువ్ మాత్రం నను మరచిపోయావ్, మరలిపోయావ్. ఏ క్షణమైనా కరుణిస్తావనుకున్నా... నువ్ లేకపోతే అంతా శూన్యం . ఒక్క క్షణం కూడా,నిను మరచినది లేదు.నీకోసం తపించనిది లేదు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం మనం . నవ్వుల ముత్యాలు,  చూపుల బాణాలు ...  స్పర్శ లో పులకింత ,  నిద్దుట్లో కలవరింత... ఎన్ని ఊసులు చెప్పుకున్నాం , ఎన్ని రహస్యాలు విప్పుకున్నాం . కొమ్మ మీద పక్షి జంటని చూసి ఒకే గూటి పక్షులని నవ్వుకున్నాం. గాలి చల్లగా వీస్తే మనకోసమే అని మురిసిపోయాం. వర్షం మనల్ని పలకరించడానికే వస్తోందనుకున్నాం . ఎన్ని తీపిగురుతులని చెప్పను. ఎలా మరచిపోయావ్ ? నా ప్రేమసామ్రాజ్యం లో తిరిగి ఎప్పడు ఉదయిస్తావ్ ... నెలలా...సంవత్సరాలా... నే ఎదురుచూస్తూనే ఉంటా.... నీ కోసం. ------------------------------------------------------------                            

అవును, నేను బయలుదేరాను...

Image
అవును ,నేను  బయలుదేరాను ... అదిగో ,అక్కడ దగ్గరగా కనిపిస్తున్నాయే ... ఆ సుదూరలకు . ఎందుకో ... ఎక్కడా ఆగలనిపించట్లలేదు . నేనేమి ఒంటరిని కాను . నాతో పాటే చాలా వస్తున్నాయ్. ఆనందంతో తుళ్ళిపడే ఆ లేగదూడ ... పొద్దస్తమానం దిక్కులు తిరిగే ఆ ప్రొద్దుతిరుగుడు... అలుపెరగని ఆ తేనెటీగ ... ఎప్పడూ దారి తప్పని ఆ చిన్ని చీమ ... ఇంకా చాలానే... ఇంతలో ... లేగదూడ కూలిపోయింది . ఎంత వెతికినా తన తల్లి దొరకదని తెలిసిపోయినట్టుంది . ప్రొద్దుతిరుగుడు తల వాల్చేసింది . ఎంత దూరం వెళ్ళినా , ఇక తెల్లారదని గ్రహించినట్టుంది . తేనెటీగ పూవు మీద వాలిపోయింది. తన తేనెపట్టు దారి , తప్పినట్టుంది . చిన్ని చీమ అలసి సొలసి ఆగిపోయింది . ఎంత వెతికినా తన గూడు అగుపించనట్టుంది . నేనింకా నడుస్తూనే ఉన్నా..... మరింత దగ్గరైన ఆ సుదూరాలకు ... ఇంకా ఆగలనిపించట్లేదు. అవును, నేను బయలుదేరాను... ( శశి గారి ప్రోత్సాహం తో .... నాకున్నపాటి జ్ఞానం తో , ఎదో  కవిత రాశాననిపించాను...:P ఎక్కడైనా తేడా గా ఉంటే , కాస్త క్షమించి , మిగతా కాస్త comments లో కక్కండి.)

ఏ కాలేజీలో నైనా క్లాసులు ఇలాగే జరుగుతాయేమో......(ఊర్కే ....తమాషా కి...... )

Image
ఇది నేను b.tech లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం లో జరిగిన సంగతి . కాలేజీ లో జాయిన్ అయిన రెండో రోజే క్లాసులు మొదలుపెట్టారు . మాకు  కంప్యూటర్ కి సంబంధించి ఒక సబ్జెక్టు ఉండేది(సబ్జెక్టు పేరు ఎందుకులెండి ) . దాన్ని చెప్పడానికి ఓ మహామహుడు(ఈయన పేరు కూడా ఎందుకులెండి )  ప్రొఫెసర్ గా వచ్చేవాడు . అయన క్లాసే  మా మొదటి క్లాసు, అదెలా జరిగిందో వినండి , సర్ లోపలికి రాగానే అందరు నిల్చున్నాం . ఆయన అందరివైపు ఓ లుక్కిచ్చేడు . అందర్నీ చూడ్డానికి పెద్ద సమయం పట్టలేదులెండి . నలభై మంది క్లాసులో నలుగురం వచ్చాం . అదేంటో, చిన్నపట్నుంచి మొదటి క్లాసు కు వెళ్ళే అలవాటే లేదు మాకు.మొదటి క్లాసు కదా  , ఏమీ చెప్పరులే అని మేమే డిసైడ్ అయిపోయేవాళ్ళం . సరే క్లాసులు మొదలైన మొదటి రోజే డుమ్మా కొడితే బావోదని నేను వెళ్ళాను. మిగతా వాళ్లకి అలాంటి పట్టింపులు ఏమిలేవనుకుంట ,లేకపొతే  మొదటి క్లాసు ఎక్కడైనా మొదటి క్లాసే అని రాలేదేమో. సరే క్లాసు మొదలుపెట్టాడు. ఏమి చెప్పకుండా డైరెక్టుగా బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి ఎదో గీస్తున్నాడు. తీరా చూస్తే అదే బొమ్మ . ఎప్పుడో ఎనిమిదో తరగతి లో కంప్యూటర్ సబ్జెక్టు మొదటి క్లాసు లో మా కంప్యూట

సీతాకోకచిలుక

Image
 ఒకానొక సాయంత్రం ఫోన్ మాట్లాడుతూ రూమ్ లో నుంచి బయటికి వచ్చాను .పొద్దున్నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం తుంపర తుంపర గా పడ్తోంది .ఇప్పుడిప్పుడే ఆగిపోయినట్లు గా ఉంది .అప్పటిదాకా ఫోన్ లో  మాట్లాడుతూ చూడలేదు కానీ అక్కడ ఉన్న మొక్కలు చాలా అందంగా ఉన్నాయ్ . అవి చల్లటి గాలి కి అటుఇటు ఊగుతున్నాయ్ . మేము కూడా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా . పక్కనే చిన్న మొక్క చాలా ముద్దు గా , అందంగా ఉంది .ఎంత అంటే చూడకుండా ఉండలేనంత , వదిలి వెల్లిపోలేనంత . దాన్ని అలా చుస్తూ ఉంటె , ఇంతలో ఒక ముద్దుల సీతాకోకచిలుక దాని మీద వాలింది. ఈ మొక్క ఫై పూర్తీ అధికారం తనదే అన్నట్టుగా . వెంటనే దాని మీద యుద్ధం ప్రకటిద్దాం అనకున్నా . కాని అది కూడా చాలా అందంగా ఉంది.పక్కనే బెంచి మీద కూర్చొని అవి ఏమి మాట్లాడుకుంటాయో విందాం అనుకున్నా . పోనీ చూద్దాం అనుకున్నా . ఎంత  విన్నా ఎంత చూసిన నాకేం అర్థం కాదని అర్థమైంది . పోనీ నేనే ఏదోటి ఊహించుకుంటే పోలే , సరదాగా అనుకున్నా . మొక్క మొదలుపెట్టిందిలా ..... "ఎందుకు నువ్వు రొజూ నామీదే వాలుతావ్ ?" "................." " అరె ,అడిగితె చెప్పవేంటి ?"

బ్లాగు మొదలు పెట్టాను , సరే .... ఏమి రాయాలి ?

Image
అది తెలియనపుడు బ్లాగు పెటడం దేనికి అట ! అని మీరు నను తిట్టుకోవచ్చు , ఏమి రాయావదు  మేము కూడా ఏమి చదవం అని తప్పించుకోవచ్చు  లేదా  ఎదో ఒకటి రాయరా బాబు తీరిక ఉంటె చదువుతాం అని విసిగుంచుకోవచ్చు ..... సరే సరే    మీకే ఇన్ని ఆలోచనలు  వచినప్పుడు నాకు కూడా ఎదో ఒక ఐడియా రాకపోతుందా అనుకున్నా .... నన్నేం చేయమంటారు , పరిస్థితి ఇలా తగలడుతుందని నేనేమన్నా అనుకున్నానా . ఐనా సరేలే ఎదో ఒకటి రాద్దామని ఇలా వచ్చా ... :) మొదట sports గురించి రాద్దామని అనుకున్నా , చదవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా రాయడానికి నాకు sports గురుంచి బొత్తిగా ఎమీ తెలియదాయె . సరే politics , అందులో కూడా నేను సున్నానే  (మరీ పెద్ద సున్నా కాదులెండి ).మరి ఎ విషయమైతే  మీకు, నాకు సరిపోయేలా ఉంటుంది మీరే కాస్త చెప్పండి . మీరు కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేరు కనుక నేనే ఆలోచిస్తాలెండి . పోనీ సినిమాలు గురించి రాస్తే , వద్దు వద్దు ,అది తలనొప్పి బాబోయ్ .  ఈ confusion లోంచి బయటికి రావడానికి time పడ్తుంది కానీ , ప్రస్తుతానికి ఎలా రాస్తే బావుంటుందో ఆలోచిదాం . మీరేమంటారు ? ( మీరు ఏమన్నా నేను దీని గురించే ఆలోచిస్తా ) ఎలా ?  ఎలా? అందరికీ