Posts

Showing posts from December, 2012

నా నుంచి దూరం వెళ్ళకు ప్రియా.........

Image
శిశిర తయారవుతోంది . తను, కార్తీక్ ను  కలవడానికి వెళ్తోంది . ఐదు నిమిషాల క్రితమే కార్తీక్ కాల్ చేసాడు. ఏదో మాట్లాడాలని చెప్పాడు. తను కార్తీక్ తో గొడవపడింది క్రితం రాత్రి. శిశిర కార్తీక్ ను ప్రేమించింది. కానీ ఇప్పుడు కాదు. తనకి కార్తీక్ తో ఉండడం ఏ మాత్రమూ ఇష్టం లేదు. కార్తీక్ అన్ని తనకు వ్యతిరేకంగా చేస్తాడని శిశిర  అభిప్రాయం.మూవీ కి వెళ్దామంటే వద్దు రెస్టారెంట్ కి వెళ్దాం అంటాడు . పోనీ సాయంత్రం అలా పార్క్ కు వెళ్దాం అంటే వద్దు గుడి కి వెళ్దాం అంటాడు . శిశిర కు ప్రేమంటే, చెప్పింది చేయాలి,అడిగింది కొనివ్వాలి, తనకు ఏమి నచ్చుతాయో అవే కార్తీక్ కు కూడా నచ్చాలి అంటుంది.కానీ కార్తీక్ అలా ఆలోచించడు . ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అంటాడు . ఆటో దిగి కార్తీక్ రూమ్ కి వెళ్ళింది శిశిర . తను కాఫీ తాగుతున్నాడు బాల్కనీ లో కూర్చొని. శిశిర తన దగ్గరికి వెళ్లి విసురు గా అడ్గింది . "ఎందుకు పిలిచావ్?" "నీతో మాట్లాడాలి శిశిర " కార్తీక్ గొంతులో బాధ, కళ్ళలో ఆర్ద్రం మాటల్లో తెలుస్తున్నాయ్. "సరే వింటాను , కానీ నా అభిప్రాయం మారదు కార్తీక్." మనిద్దరం విడిపోదాం అని క్రితం ర

ఓ మిస్సమ్మా.......! (మహానటి సావిత్రిగారి జన్మదిన సందర్భంగా)

Image
  ఓ మిస్సమ్మా!    అందమనే పదం నీకోసమే పుట్టిందేమో!   నీవు నవ్వితే నవరత్నాలు నిస్సందేహంగా రాలునేమో!   నటనకు నడకలు నేర్పినది నీవేనేమో!    ఓ సావిత్రీ!   ఎక్కడని వెతక ము నీకోసం  కానీ ఎక్కడా కనిపించవేం?  ‘ దేవదాసు’లో చూ శాము , పార్వతియే కనిపించింది  ‘కన్యాశుల్కం’ లోనూ , మధురవాణియే కవ్వించింది  ‘ మిస్సమ్మ’లో వెతికితే, మేరియే తారసపడింది   చివరికి,  ‘ మాయాబజార్’లోనూ గాలించా ము , అక్కడా శశిరేఖయే   ఎదురుపడింది    ఎక్కడెక్కడ వెతికినా సావిత్రి మాత్రం అగుపించలేదు  నీవు చేసిన పాత్రలే పలకరించాయి    ఓ రాధా!  ‘ సుందరీ!, నీవంటి దివ్యస్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా!’  ‘నీవేనా నా మదిలో నిలచి, హృదయము కలవరపరచినది’  ‘ నా హృదయంలో నిదురించే చెలీ! ’ ఇలా ఎన్నెన్నో రాగాలు, సరాగాలు నీ గురించి.   ఓ మధురవాణీ!   యుగాలు గడచినా, తరాలు మారినా అందం, అభినయం కలబోసిన దేవత ఎవరంటే మేము నీ పేరే చెబుతాం ఎందుకంటే , ఓ మిస్సమ్మా!, మేము నీ అభిమానులం. నీకు మేము మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు