Posts

Showing posts from 2017

పొట్టి బుడంకాయ్!

Image
    దానికిఅప్పుడు మూడేళ్ళు ఉండేవనుకుంట. మా పెద్దమ్మ కూతురు. చిన్ని అని పిలిచే వాళ్ళం మేమంతా. నేను మాత్రం పొట్టి బుడంకాయ్ అనేవాణ్ణి. మహా పెంకి పిల్ల. ముళ్ళపూడి గారి 'బుడుగు' లేడీ వెర్షన్. అందుకనే ఆ పేరు పెట్టా. అదిగాని నోరు తెరిచిందంటే మేమంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. తెలుగు లో రైమ్స్ నేర్చుకుంది కొత్తగా. ఉంటాయి గా, చిన్నపిల్లల రైమ్స్ ఏవో. చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టింద, ఛుక్ ఛుక్ రైలు వస్తోంది... అవీ ఇవీ. ఇంటికి ఎవరొచ్చినా పాపం బుడ్డది ఇవన్ని చెప్పాల్సిందే. చెప్పేదాకా మా పెద్దమ్మ వదిలేది కాదు. అప్పుడప్పుడు రూపాయి బిళ్ళ లంచం ఇవ్వాల్సోచ్చేది. లేకపోతె వాళ్ళమ మొట్టికాయ ఒకటిచ్చేది. ఏది ఏమైనా వచ్చిన వాళ్ళకి రైమ్స్ వినిపించాల్సిందే. ప్లే స్కూల్ లో ఆడుకుంటూ చెమ్మ చెక్క చేరాడేసి మొగ్గ పాటని నేర్చుకుంది కొత్తగా. దానికి ఆ పాట బాగా నచినట్టుంది. ఎవరు కనిపించినా..అడిగినా అడక్కపోయినా...చేప్పేసేది. భలే ముద్దు గా చెప్తోంది కదా.. ఏది నాకు చెప్పమ్మా అన్నాను. చెమ్మా చెక్కా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మ

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones

Image
1. మీ పేరెంట్స్ ఫోన్ లో ఫేస్బుక్ ఆప్ ని డిలీట్ చేసేయండి. ఒకవేళ మీ నాన్న/అమ్మ కి ఆల్రెడీ ఫేస్బుక్ లో అకౌంట్ ఉంటే మీరు మాత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకండి. మీ నాన్న/అమ్మ ఆల్రెడీ మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే మాత్రం ఆ దేవుడే మిమ్మల్ని కాపాడగలడు. 2. మీకు ఇష్టం వచ్చిన హీరోయిన్, మీ గర్ల్ ఫ్రెండ్/ బాయ్ ఫ్రెండ్ పిక్స్, మీ ఫ్రెండ్స్ తో కలిసి మందు కొడుతున్న పిక్స్, ఇంకేదైన పిచ్చి పిచ్చి బొమ్మలు డీపీ లు గా పెట్టడం మానుకోండి. లేదంట తరువాతే మీరే బాధపడాల్సి వస్తుంది. 3. రోజులో కనీసం ఒకసారైనా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. లేకపోతే ఎప్పుడో ఒకసారి.. " రోజుకు ఒక మెసేజ్ కూడా పెట్టవు, ఏంట్రా అంత బిజీ, వెధవన్నర వెధవ?" అనే ప్రమాదం ఉంది. 4. ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు దేవుడి ఫోటో లు, మంచి కోటషన్స్ ఫార్వర్డ్ చేయండి. మీ ఆరోగ్యానికి మంచిది. 5. "ఈ మెసేజ్ పది మందికి ఫార్వర్డ్ చెయండి. మీకు మంచి జరుగుతుంది. చేయకపోతే మీరు ఢమాల్.." లాంటి పిచ్చి పిచ్చి మెసేజ్ లు ఇంట్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేయకండి. 6. ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో మీ పేరెంట్స్ ఉంటే, అమ్మాయిల ఫోటోలకి కామెంట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆ

అమ్మ పెట్టిన చివాట్లు, తాత చెప్పిన మంత్రాలు!!

Image
     సాయంత్రం అవ్వగానే ఆఖరి బెల్లు ఎప్పుడెప్పుడు కొడతారా అని వెయిట్ చేసేవాళ్ళం. ఐదవ తరగతి వాళ్ళకి చివరి క్లాసు జరగడం ఎప్పుడో ఒకసారి. టీచర్లు అంత మూడు, నాలుగు తరగతుల వాళ్ళకి పాఠాలు చెప్తుంటారు. సరే చివరి క్లాసు ఎలాగూ జరగదు కదా ఎగ్గొట్టి పొదాం అంటే స్కూల్ లీడర్ నేనె. కాబట్టి చివరి బెల్లు కొట్టాల్సింది నేనె. హెడ్ మాస్టర్ లేకపోతే బెల్లు బరువు బాధ్యతలు శివ గాడి కి ఇచ్ఛేవాడ్ని. బెల్లు హెడ్ మాస్టర్ రూమ్ లొనే ఉంటుంది. నేను కాకుండా ఎవరన్నా బెల్లు ముట్టుకుంటే, తరువాతి రోజు నాకు బెల్లు పగులుతుంది. ఇలానే నేను నా బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ స్కూలు లీడర్ పదవిని కార్తికు గాడికి కట్టబెడతారు. అప్పుడు నా పరువంతా ఏం కావాలి. స్కూల్ లో ఏదైనా ఫంక్షన్ జరిగినపుడు, చాక్లెట్లు పంచాల్సింది నేనే. మిగిలిపోయిన చాక్లెట్లు అన్ని నా స్కూల్ బ్యాగు లోకి వెళ్లిపోయేవి. ఎవరైనా పెద్ద గెస్ట్లు వస్తే, వాళ్ళిచ్ఛే నోటు పుస్తకాలన్ని పంచాల్సింది నేనె. మిగిలిన నోటు పుస్తకాలు మళ్ళీ నా బ్యాగు లోకే వెళ్ళేవి. స్కూల్లో ఎప్పుడైనా మ్యాజిక్ షో లు జరిగితే ముందు వరస లో కూర్చొని చూడచ్చు. ఇవన్నీ కార్తికు గాడికి అప్పన

రాజాధిరాజావప్పా...పిచ్చెట్టా పట్టిందబ్బా...!!

Image
     అనగనగా ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన పిచ్చి మహారాజు ఒకడుండేవాడు. ఆయన చేసేవన్నీ మహా పిచ్చి పనులే. ఎందుకు ఎలా అని నన్ను అడగద్దు. నాక్కూడా చెప్పలేదు. నాకే కాదు, ఎవ్వరికి చెప్పలేదు. చెప్పడు కూడా. ఎందుకంటే ఆ పెద్దాయనకి పిచ్చి. చెప్పా కదా, మహా పిచ్చి. పిచ్చి పీక్స్.అస్సలు ఏమన్నా చెప్తేనేకదా, ఎవరికైనా తెలిసేది. ఆయనకి ఎందుకు పిచ్చి పట్టిందో తెల్సిన వాళ్ళందరూ ఇప్పుడు రాజ్యం లో లేరు. ఎప్పుడో బకెట్లు,పాత్రలు, కుండలు, చెంబులు వాళ్ళ ఇంట్లో ఏముంటే అవి తన్నేసి పోయారు. ఈ పిచ్చిమారాజు ఒక్కడే మిగిలాడు. చెప్పా గా, ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టాడు అని.      ఈ పిచ్చిమారాజు అస్సలు రాజు ఎట్టా అయ్యాడు అని రాజ్యం లో అందరికి మహా డౌటు గా ఉండేది. కానీ ఎవ్వరికి అడగడానికి జేబులో గుండె ఉండేది కాదు. అడిగితే ఏ పిచ్చి శిక్షో వేస్తాడు అని. వెనుకటికి పిచ్చిపుల్కన్న అనే గొప్పవ్యక్తి ఇట్లానే ముందు వెనుక ఆలోచించకుండా రాజదర్బారు లో దూరి దొరగారి కాలరు దొరకబట్టుకొని ఏందిబే ని పిచ్చి దొరతనం అని దున్నేసాడంటా. దొరగారు మొదట జడుసుకొని, తరవాత తానే రాజు అని గుర్తు తెచ్చుకొని, ఏమంటివి ఏమంటివి.. రాజుగారి నే ఏందిబే అందు

బ్లాగర్ వాడే రచయితలకి ఉపయోగపడే చిన్న సలహా..

Image
     బ్లాగ్లోకానికి నమస్తే, వీడేంటి మాకు సలహా ఇచేది అనుకోకుండా కాస్త చదవండి. ఈ సలహా blogger.com వాడుతున్న రచయితల కోసం. మనలో చాలా మంది కొన్ని సంవత్సరాలుగా బ్లాగ్గింగ్ చేస్తున్నారు. మొదట్లో బ్లాగులు రాసే వాళ్ళు, మరియు చదివే వాళ్ళు సిస్టం లేదా లాప్టాప్ వాడేవాళ్ళు. కాని ఇప్పుడు మాత్రం 40 నుంచి 60 శాతం, కొన్ని బ్లాగులకి అంతకంటే ఎక్కువ శాతం మొబైల్ విసిటర్స్ ఉన్నారు. ఈ విషయాన్ని మీ blogger dashboard లో stats లో ఉన్న audience tab లో చూడచ్చు. కాని వచ్చిన చిక్కల్లా, మనం వాడే బ్లాగు థీమ్స్ బాగా/కొంచెం పాతవి. ఈ థీమ్స్ మొబైల్ లో సపోర్ట్ చేసిన, నావిగేషన్ కష్టం గా ఉంటుంది. అందువల్ల మొబైల్ లో మన బ్లాగు చూసే వాళ్ళకి ఏదైనా old post చూడాలంటే, వరుసగా నెక్స్ట్ క్లిక్ చేస్తూ పోవాల్సివస్తుంది. ఇలాంటప్పుడు మన రీడర్ కి చదివే ఇంట్రెస్ట్ పోతుంది. Wordpress ఇలాంటి విషయాల్లో Blogger కంటే కొంచెం మెండే అయిన, చాలామంది రచయితలు, సులభం గా ఉండడం వల్ల Blogger నే ఎంచుకుంటారు. దీన్ని పరిష్కరించడానికి Blogger(Google) కొత్త థీమ్స్ ని ప్రవేశపెట్టింది. 

నాకు మాత్రం ఉండదా!!

Image
నా పాటికి నేను గుర్రుపెట్టి నిద్రపోతుంటానా, మెత్తగా బుగ్గ మీద మీటి తెల్లారింది లే అంటావ్, నాకు మాత్రం ఉండదా, ఈ అందమైన ఉదయం నీతో గడపాలని. నా పాటికి నేను బాల్కనీ లో కాఫీ తాగుతూ ఉంటానా, మెల్లగా వచ్చి ఒల్లో కూర్చొని సరసాలు ఆడుతావ్. నాకు మాత్రం ఉండదా, ప్రేమ గా నీతో ఆడుకోవాలని. నా పాటికి నేను లీనమై పేపర్ చదువుతుంటానా, టిఫిన్ పట్టుకొచ్చి ప్రేమగా తినరాదూ అంటావ్. నాకు మాత్రం ఉండదా, నీ చేతి వంట కడుపార తినాలని. నా పాటికి నేను ఆఫీసుకి పోతూ ఉంటానా, అడ్డొచ్చి అమాయకం నిండిన చూపుల్తో ఆగిపోరాదూ అంటావ్. నాకు మాత్రం ఉండదా, రోజంతా నీతో గడపాలని. నా పాటికి నేను ఎదో పని చేసుకుంటుంటానా, కాల్ చేసి మధురం గా ఏం చేస్తున్నారండి అంటావ్. నాకు మాత్రం ఉండదా, నీతో గంటలకొద్ది మాట్లాడాలని. నా పాటికి నేను కొలీగ్స్ తో మాటల్లో మునిగిపోయుంటే, లంచ్ టైం అయింది బావ అని ముద్దుగా మెసేజ్ పెడ్తావ్. నాకు మాత్రం ఉండదా, నీతో కలిసి లంచ్ చేయాలని. నా పాటికి నేను మొహం కడుక్కొని ఇంట్లోకి వస్తుంటే, గుమ్మం దగ్గర నుల్చోని, తుడవనా అని కొంటెగా కన్నుమీటుతావ్. నాకు మాత్రం ఉండదా, నీతో సరసాలాడాలని. [ ఈ కార్పొరేట్ జీవితాల్లో, ఆఫీసు

కృష్ణ గాడి వీర ఆఫీసు గాధ

Image
      ఈ ప్రపంచం లో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటి అని నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం... పొదున్నే లేవడం. కావాలంటే పొద్దున ఆరు గంటల దాకా మేలుకుంటా గాని, పొద్దున్నే ఆరుకే లేవమంటే మాత్రం కుదరదు. బుద్దున్నవాడేవాడన్న అంత పొద్దున్నే లేస్తాడా చెప్పండి. నైట్ అంతా ఫేసుబుక్ లో దొర్లాలి..యూట్యూబ్ లో దేఖాలి( హిందీ లో చెప్పా)... వాట్సప్ లో దున్నాలి... ఇంతా కష్టపడి అర్ధరాత్రి దాక మేలుకుంటే, పొదున్నే లేచి ఆఫీసు కి పోవాలి. ఏం.. మా లాంటి పెళ్లి కాని కుర్రాలకి మధ్యాహ్నం నుంచి ఆఫీసు కు వచ్చే వెసులుబాటు ఇవ్వొచ్చు గా.       సరే అని యాజ్ యూసువల్ గా, లేటుగా ఆఫీస్ కి వెళ్ళా... ఆఫీస్ గుమ్మం దగ్గర గుమ్మడికాయ (మా రెసెప్షనిస్టు) కిక్కికి.. అని వెకిలి గా నవ్వింది...అలా హాలులో నడుస్తూ వెళ్తుంటే కోలీగ్ వెటకారంగా, నా మీద యుద్ధం గెల్చినట్టు ఓ పిచ్చి చూపు, ఓ వెర్రి నవ్వు విసిరాడు.. ఈ వెర్రిమాలోకంతో ఏంటి లే అని నా డెస్క్ దగ్గర పోయా. "కం టు మై డెస్క్" ఇట్లు మీ పిచ్చిబాసు (పిచ్చి నేను యాడ్ చేశా) అని బంక నోటు ముక్క( స్టికీ నోట్స్) సిస్టం కి అంటించి ఉంది. తొక్కలో వాడు పిలిస్తే నేనేంటి పొయేది

చిన్నప్పటి కబుర్లు - నేను నా బొమ్మలు

Image
        అందరి పిల్లలాగే నాక్కూడా బొమ్మలంటే చాల ఇష్టం. ముఖ్యంగా కూ.. చుక్ చుక్ ..రైలు బొమ్మ, బ్రూ..మ్ బ్రూ.....మ్  కారు బొమ్మ, ట్రింగ్ ట్రింగ్ ఫోన్ బొమ్మ... నాకు బాగా ఇష్టమైన బొమ్మలు. రైలు తీస్కుని.. ఇసుక లో పట్టాలు లేకపోయినా భలేగా నడిపేసేవాడ్ని. కారు బొమ్మలు రెండు ఉండేవి. ఒకటి ఎర్రది ఇంకోటి నల్లది. నల్లది పోలీసు కారు, ఎర్రది దొంగల కారు. ఎడమ చేతి తో దొంగలు కారు పారిపోతుంటే కుడి చేతి తో పోలీసు కారు వెంటాడేది. నా హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఇష్టం ఇక్కడ్నుంచే వచ్చిందన్నమాట. ఇంక టెలిఫోన్ ఐతే రింగు నేనే, అటు వైపు నేనే, ఇటు వైపు నేనే. అప్పుడప్పుడు పోలీసులు నాకు ఫోన్ చేసి దొంగల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కొన్ని సార్లు మా పెద్దమ్మ కి కాల్ చేసి మాట్లాడేవాడిని. ఇంకొన్ని సార్లు సుజి (ఎవరో చెప్పను పొండి :p ) తో మాట్లాడేవాడిని. మిగతా పిల్లలకి ఈ బొమ్మలు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలీదు గాని నాకు మాత్రం రెండు కారణాలున్నాయి. బొమ్మలు నా చాకోలెట్లు, బిస్కెట్లు అడగవ్ - అప్పట్లో చాలా తెలివిగా మా స్కూల్ పక్కనే కిరానా కొట్టు పెట్టారు. పెట్టింది కూడా మా స్కూల్ హెడ్ మాస్టరే. మాస్టరమ్మ ఆంటీ (హెడ్ మాస్టరు

ఆదివారం అమావాస్య అర్థరాత్రి

Image
ఆదివారం అమావాస్య అర్థరాత్రి(నిన్ననే!)... ఆదివారం అమావాస్య అర్థరాత్రి సమయంలో ఏవేవో జరుగుతాయని చిన్నపుడు మా నానమ్మ చెప్తే నేను నమ్మేవాణ్ణి కాదు. కానీ నిన్న రాత్రి జరిగింది తల్చుకుంటే నిజమేమోననిపిస్తుంది. రాత్రి నేను టెర్రస్ మీద పడుకొని ఉన్నాను. సడెన్ గా అర్థరాత్రి మెళకువ వచ్చింది. నా మీద ఉన్న దుప్పటి ఎవరో లాగుతున్నట్టనిపిచింది. దాంతో నాకు టెన్షన్ వేసింది. తర్వాత దాహమేసింది(అంటే గొంతెండిపోయింది).మొత్తానికి చాలా భయమేసింది. ఎంతంటే ఆ భయంతో కళ్లు కూడా తెరవలేకపోయాను.కానీ నోరు తెరిచి చూళ్లేం కదా! అందుకే కళ్లే తెరిచాను.నా కాళ్ల దగ్గర ఏదో ఆకారం అస్పష్టంగా కదులుతున్నట్టుగా అనిపించింది.నా గుండెలు ఝల్లుమన్నాయి(క్షమించాలి నాకున్నది ఒక గుండే ఐనా అందరూ వాడతారని బహువచనం వాడాను). అక్కడున్నదేదో చూద్దామంటే చుట్టూ మన ప్రభుత్వం దయ(కరెంటు కోత) వల్ల వచ్చిన కారుఛీకటి అప్పుడే వేసిన తారురోడ్డులా ఉంది(ఛ! సమయానికి సరైన ఉపమానాలు కూడా గుర్తొచ్చి చావవు). పైగా అమావాస్యట నిన్న, నెలకోసారే కదా అని చంద్రుడు కూడా రెస్ట్ తీస్కోవడానికి వెళ్లాడు. కళ్లకు గంతలు కట్టు

పే...ద్ద దోశ!!

Image
సంక్రాంతి పండుగకని ఇంటికి వెళ్ళాను. ఇంటి బయట ఆటో దిగగానే సీరియస్ గా  ఓ లుక్ ఇచ్చింది అమ్మ. చెన్నై నుంచి మల్లీ ఇంటికి రావడానికి రెండు నెలలు పట్టింది. అందుకే అమ్మ చాలా కోపం గా ఉంది . అదేంటో, అమ్మ కోపం లో బోలెడంత ప్రేమ కూడా ఉంటుంది. అందుకే, నేను ఫ్రెష్ అయ్యే లోపు బ్రూ కాఫీ రెడీ గా ఉంది. అమ్మ కోపం లాగె కాఫీ కూడా చాలా వేడి గా ఉంది.  కాఫీ తాగేంత సేపు లేదు, అమ్మ కోపం. భుజం మీద గాట్టిగా ఒక్కటిచ్చి, "ఇంకో వారం చూసి, మేమె వచ్చేవాళ్ళం చెన్నై కి" అని నవ్వేసింది. ఉదయాన్నే చల్లటి నీటి తో మొహం కడుక్కొని, పొగలు కక్కుతున్న కాఫీ తాగడం లో ఉన్న సంతృప్తి ఇంకేదాంట్లో దొరకదేమో. అదీ అమ్మ చేతి కాఫీ.. <3. చిక్కటి కాఫీ గొంతులో వెళ్తుంటే...గుటక గుటక కి కళ్ళు మూసుకొని... వేడి పొగ ను ఆస్వాదిస్తూ... ఆ తియ్యదనం నోటి లో ఇంకిపోతుంటే ...దీని కోసమే ప్రతి రోజు పని వదిలేసి ఇంటికి వచ్చేయచ్చు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ ని పోల్చడానికి ఏ గొప్ప విషయం సరిపోదు. వాటికవే సాటి. నాన్న బయట 'ఈనాడు' చదువుతూ ఉన్నాడు. అమ్మ టిఫిన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. నేను టీవీ చూడ్డం మొదలుపెట్టా. ఏవో సినిమా పాటలు వస్తున్నాయ్. చిన్