Posts

Showing posts from May, 2017

పొట్టి బుడంకాయ్!

Image
    దానికిఅప్పుడు మూడేళ్ళు ఉండేవనుకుంట. మా పెద్దమ్మ కూతురు. చిన్ని అని పిలిచే వాళ్ళం మేమంతా. నేను మాత్రం పొట్టి బుడంకాయ్ అనేవాణ్ణి. మహా పెంకి పిల్ల. ముళ్ళపూడి గారి 'బుడుగు' లేడీ వెర్షన్. అందుకనే ఆ పేరు పెట్టా. అదిగాని నోరు తెరిచిందంటే మేమంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. తెలుగు లో రైమ్స్ నేర్చుకుంది కొత్తగా. ఉంటాయి గా, చిన్నపిల్లల రైమ్స్ ఏవో. చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టింద, ఛుక్ ఛుక్ రైలు వస్తోంది... అవీ ఇవీ. ఇంటికి ఎవరొచ్చినా పాపం బుడ్డది ఇవన్ని చెప్పాల్సిందే. చెప్పేదాకా మా పెద్దమ్మ వదిలేది కాదు. అప్పుడప్పుడు రూపాయి బిళ్ళ లంచం ఇవ్వాల్సోచ్చేది. లేకపోతె వాళ్ళమ మొట్టికాయ ఒకటిచ్చేది. ఏది ఏమైనా వచ్చిన వాళ్ళకి రైమ్స్ వినిపించాల్సిందే. ప్లే స్కూల్ లో ఆడుకుంటూ చెమ్మ చెక్క చేరాడేసి మొగ్గ పాటని నేర్చుకుంది కొత్తగా. దానికి ఆ పాట బాగా నచినట్టుంది. ఎవరు కనిపించినా..అడిగినా అడక్కపోయినా...చేప్పేసేది. భలే ముద్దు గా చెప్తోంది కదా.. ఏది నాకు చెప్పమ్మా అన్నాను. చెమ్మా చెక్కా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మ

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones

Image
1. మీ పేరెంట్స్ ఫోన్ లో ఫేస్బుక్ ఆప్ ని డిలీట్ చేసేయండి. ఒకవేళ మీ నాన్న/అమ్మ కి ఆల్రెడీ ఫేస్బుక్ లో అకౌంట్ ఉంటే మీరు మాత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకండి. మీ నాన్న/అమ్మ ఆల్రెడీ మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే మాత్రం ఆ దేవుడే మిమ్మల్ని కాపాడగలడు. 2. మీకు ఇష్టం వచ్చిన హీరోయిన్, మీ గర్ల్ ఫ్రెండ్/ బాయ్ ఫ్రెండ్ పిక్స్, మీ ఫ్రెండ్స్ తో కలిసి మందు కొడుతున్న పిక్స్, ఇంకేదైన పిచ్చి పిచ్చి బొమ్మలు డీపీ లు గా పెట్టడం మానుకోండి. లేదంట తరువాతే మీరే బాధపడాల్సి వస్తుంది. 3. రోజులో కనీసం ఒకసారైనా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. లేకపోతే ఎప్పుడో ఒకసారి.. " రోజుకు ఒక మెసేజ్ కూడా పెట్టవు, ఏంట్రా అంత బిజీ, వెధవన్నర వెధవ?" అనే ప్రమాదం ఉంది. 4. ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు దేవుడి ఫోటో లు, మంచి కోటషన్స్ ఫార్వర్డ్ చేయండి. మీ ఆరోగ్యానికి మంచిది. 5. "ఈ మెసేజ్ పది మందికి ఫార్వర్డ్ చెయండి. మీకు మంచి జరుగుతుంది. చేయకపోతే మీరు ఢమాల్.." లాంటి పిచ్చి పిచ్చి మెసేజ్ లు ఇంట్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేయకండి. 6. ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో మీ పేరెంట్స్ ఉంటే, అమ్మాయిల ఫోటోలకి కామెంట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆ

అమ్మ పెట్టిన చివాట్లు, తాత చెప్పిన మంత్రాలు!!

Image
     సాయంత్రం అవ్వగానే ఆఖరి బెల్లు ఎప్పుడెప్పుడు కొడతారా అని వెయిట్ చేసేవాళ్ళం. ఐదవ తరగతి వాళ్ళకి చివరి క్లాసు జరగడం ఎప్పుడో ఒకసారి. టీచర్లు అంత మూడు, నాలుగు తరగతుల వాళ్ళకి పాఠాలు చెప్తుంటారు. సరే చివరి క్లాసు ఎలాగూ జరగదు కదా ఎగ్గొట్టి పొదాం అంటే స్కూల్ లీడర్ నేనె. కాబట్టి చివరి బెల్లు కొట్టాల్సింది నేనె. హెడ్ మాస్టర్ లేకపోతే బెల్లు బరువు బాధ్యతలు శివ గాడి కి ఇచ్ఛేవాడ్ని. బెల్లు హెడ్ మాస్టర్ రూమ్ లొనే ఉంటుంది. నేను కాకుండా ఎవరన్నా బెల్లు ముట్టుకుంటే, తరువాతి రోజు నాకు బెల్లు పగులుతుంది. ఇలానే నేను నా బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ స్కూలు లీడర్ పదవిని కార్తికు గాడికి కట్టబెడతారు. అప్పుడు నా పరువంతా ఏం కావాలి. స్కూల్ లో ఏదైనా ఫంక్షన్ జరిగినపుడు, చాక్లెట్లు పంచాల్సింది నేనే. మిగిలిపోయిన చాక్లెట్లు అన్ని నా స్కూల్ బ్యాగు లోకి వెళ్లిపోయేవి. ఎవరైనా పెద్ద గెస్ట్లు వస్తే, వాళ్ళిచ్ఛే నోటు పుస్తకాలన్ని పంచాల్సింది నేనె. మిగిలిన నోటు పుస్తకాలు మళ్ళీ నా బ్యాగు లోకే వెళ్ళేవి. స్కూల్లో ఎప్పుడైనా మ్యాజిక్ షో లు జరిగితే ముందు వరస లో కూర్చొని చూడచ్చు. ఇవన్నీ కార్తికు గాడికి అప్పన