Posts

Showing posts from 2018

Tanu - oo gnapakam!

Image
tanani last time chusi oo padi samvatsaru ayyuntundi. appudu tanu oo chinna pilla laa undedi. 10th class lo naa class mate tanu. class lo evaraina tanani tease cheste chinna pilla la edchesedi. naa height lo sagam undedi. nenu kuda andari lagane potti.. potti ani edpinche vadni. andaru tease chestunte feel ayyedi kani nenu tease chesinappudu maatram navvedi. siggu padedi anachemo. kani aa vayasu lo naaku telidu. tana kallu lite brown colour lo.. pedha ga.. gundram ga undevi. aa kalla loki chustu hypnotize ayipoyevadni. ika tanani first time chusinappudu ayite ice laaga froze ayipoyanu. antha cute ga undedi. nenu tanani chustunta ani tanaki telusu. appudappudu natho baga matladedi, konni sarlu asalu pattinchukunedi kaadu. nene tanatho matladalani aa text book ivvu, ee notes teesko ani edo okati matlade vadni. okasari ground lo tanu kallu tirigi padipothe, teachers evaru lekapothe tanani ethukoni medical room ki teeskella. ippati varaku adi nene ani tanaku telidu. ippa

వానర్ బాబా - ఓ కోతి కథ!

"వానర్ కుమార్ ఆన్ డ్యూటీ సర్.. సిటీ లో ఉన్న ముప్పై మంది క్రిమినల్స్ మటాష్ సర్. వాళ్ళ దగ్గర పని చేసే చెంచాలు అందరు బెహైండ్ ది బార్స్ ఉన్న్నారు సర్" గొంతు చించుకున్నాడు అప్పుడే కొత్త గా SI డ్యూటీ లో జాయిన్ అయిన వానర్ కుమార్. అదంతా చెవులు మూస్కొని జాగ్రత్త గా వింటున్న DSP వానరేష్, బెహైండ్ ది బార్స్ అనగానే అలెర్ట్ అయిపోయి, పోలీస్ స్టేషన్ లో ఉన్న కోతులన్నీ..అదే పోలీస్ లందరూ, బార్ కి వెళ్లి బీర్ బ్రేక్ తీస్కోవాలని అని ఆర్డర్ పాస్ చేసాడు. కానీ టైం ఇంకా ఎర్లీ మార్నింగ్ పదే అని పక్కనే ఉన్న కానిస్టేబుల్ కోతి బాబు గుర్తు చేయడం తో.. కాస్త నెమ్మదించి, బీర్ బ్రేక్ ని కాస్త కాఫీ బ్రేక్ గా సవరించి కొత్త ఆర్డర్ పాస్ చేసాడు. ఇంత కష్టపడ్డ, తన ప్రతిభ ని DSP గుర్తించకపోవడం తో.. బాధ తో కాఫీ తాగడం కన్నా బీర్ తాగితే తన బాధ కొంచెం తగ్గుతుందని అలోచిస్తున్న వానర్ కుమార్ థాట్స్ కి వానరేష్ లాంగ్ జంప్ చేసి అడ్డొచ్చి.. "ఇంత కష్టపడి.. ఆ చెట్టు, ఈ చెట్టు ఎక్కి..దూకి..పాకి.. క్రిమనల్స్ ని నెల నాకించినందుకు గాను.. నీకు కంగ్రాట్స్." అని ఆవేశం గా ఒక డైలాగ్ విసిరి, ఆయాసం గా క్కుర్చి లో కూ

Ghost From The Mirror!

Image
సాయంత్రం 7 గంటల ప్రాంతం లో అనుకుంటా, మేనేజర్ అర్జంట్ గా రమ్మని కాల్ చేస్తే ఆఫీసు కి వెళ్లాను. క్రిటికల్ అప్లికేషన్స్ కి సంబంధించిన డేటా ఇష్యూ. ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ కి నాకే కాల్ చేస్తాడు మా మేనేజర్. మాములుగా అయితే ఇంట్లో నే నా లాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యే వాడిని. కాని పవర్ మైన్టైనన్స్ వల్ల మధ్యాన్హం 2 గంటల నుంచి పవర్ లేదు. సరిత తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి వెళ్ళింది. నాక్కూడా ఒక్కడినే బోర్ కొడ్తోంది. అందుకని ఇంక ఆఫీసు కి బయల్దేరాను. ఆదివారం కావడం తో రోడ్స్ అన్ని ఖాళి గా ఉన్నాయ్. పైగా మా ఆఫీసు ఉండేది సిటీ అవుట్ స్కర్ట్స్ లో. అయిదు లేదా పది నిమిషాలకి ఒకసారి ఎదురుగానో వెనుకనుంచో వచ్చే వెహికల్ సౌండ్స్.. హెడ్ లైట్స్ .. తప్ప మరో సౌండ్ కాని మూవ్మెంట్ కాని లేవు. నేను కూడా పెద్ద స్పీడ్ గా వెళ్ళట్లేదు. ఈ టైం లో తాగి నడిపే వాళ్ళు ఎక్కువ ఈ రూట్ లో.. అందుకనే 40 లో వెళ్తున్న. అమావాస్య కాకపోయినా అమావాస్య అంత చిమ్మచీకటి గా ఉంది చుట్టూ. రోడ్ వంపుల దగ్గర హెడ్ లైట్స్ పడి ఎదురుగా చీకట్లో ఉన్న చెట్లు వింత ఆకారాల్లో ఉన్న దయ్యాల్లాగా అనిపిస్తునాయ్. లైట్ వాటి మీద పడి వాటి షాడోస్ లైట

మనసును తాకిన కాగితం!

Image
వేసవి కాలం. సూర్యుడి తాపం తగ్గి ఇప్పుడిప్పుడే కాస్త సాయంత్రపు గాలులు పలకరించడం మొదలుపెట్టాయ్. రోజూ ఆఫీసు నుండి అలసిపోయి వచ్చే నేను, ఆదివారం కావడం తో పని లేక అలసిపోయాను. ఒళ్ళంతా బద్ధకం గా ఉంది. చేసేదేం లేక వెళ్లి ఒక గంట సేపు చల్లటి షవర్ స్నానం చేసి, జుట్టు తుడుచుకునే ఓపిక లేక కొప్పు కట్టుకున్నాను. AC ఆన్ చేసి కిటికీలు క్లోజ్ చేసి నా స్టడీ చైర్ లో కూర్చున్న. మృదువు గా నా ముఖాన్ని తాకుతున్న చల్లటి AC గాలి నా మనసులో ఇంకా నిద్రపోతున్న తాజాదనాన్ని మధురం గా తట్టి లేపుతోంది. ది ఫౌంటెన్ హెడ్ బై ఆయన్ రాండ్. ఎప్పుడో సంవత్సరం క్రితం బుక్ ఫెయిర్ లో కొన్నట్టు గుర్తు. బుక్స్ కొనడం లో తప్ప చదవడం లో లేని నా ఇంట్రెస్ట్ ని, ఓపెన్ చేసిన ప్రతిసారి, రెండు పేజిలు చదివి అటకెక్కే నా ఓపిక ని వెక్కిరిస్తూ షెల్ఫ్ లో కనబడిందా పుస్తకం. ఎలాగైనా ఈరోజు ఒక పది ఇరవై పేజీలు దాటాలని గట్టిగా అనుకుని పుస్తకాన్ని ఓపెన్ చేశాను. అస్తమిస్తున్న సూర్యుడి కాంతి, ఎదురుగా ఉన్న కొత్త గా కట్టిన అపార్ట్ మెంట్స్ గాజు కిటికీల మీద పడి, దాని రిఫ్లెక్సన్ నా రూమ్ కిటికీ అద్దం లోంచి నా రూమ్ లోకి దూరి, రూమ్ మొత్తం ఎర్రటి