Posts

Showing posts from April, 2018

మనసును తాకిన కాగితం!

Image
వేసవి కాలం. సూర్యుడి తాపం తగ్గి ఇప్పుడిప్పుడే కాస్త సాయంత్రపు గాలులు పలకరించడం మొదలుపెట్టాయ్. రోజూ ఆఫీసు నుండి అలసిపోయి వచ్చే నేను, ఆదివారం కావడం తో పని లేక అలసిపోయాను. ఒళ్ళంతా బద్ధకం గా ఉంది. చేసేదేం లేక వెళ్లి ఒక గంట సేపు చల్లటి షవర్ స్నానం చేసి, జుట్టు తుడుచుకునే ఓపిక లేక కొప్పు కట్టుకున్నాను. AC ఆన్ చేసి కిటికీలు క్లోజ్ చేసి నా స్టడీ చైర్ లో కూర్చున్న. మృదువు గా నా ముఖాన్ని తాకుతున్న చల్లటి AC గాలి నా మనసులో ఇంకా నిద్రపోతున్న తాజాదనాన్ని మధురం గా తట్టి లేపుతోంది. ది ఫౌంటెన్ హెడ్ బై ఆయన్ రాండ్. ఎప్పుడో సంవత్సరం క్రితం బుక్ ఫెయిర్ లో కొన్నట్టు గుర్తు. బుక్స్ కొనడం లో తప్ప చదవడం లో లేని నా ఇంట్రెస్ట్ ని, ఓపెన్ చేసిన ప్రతిసారి, రెండు పేజిలు చదివి అటకెక్కే నా ఓపిక ని వెక్కిరిస్తూ షెల్ఫ్ లో కనబడిందా పుస్తకం. ఎలాగైనా ఈరోజు ఒక పది ఇరవై పేజీలు దాటాలని గట్టిగా అనుకుని పుస్తకాన్ని ఓపెన్ చేశాను. అస్తమిస్తున్న సూర్యుడి కాంతి, ఎదురుగా ఉన్న కొత్త గా కట్టిన అపార్ట్ మెంట్స్ గాజు కిటికీల మీద పడి, దాని రిఫ్లెక్సన్ నా రూమ్ కిటికీ అద్దం లోంచి నా రూమ్ లోకి దూరి, రూమ్ మొత్తం ఎర్రటి