Posts

Showing posts from 2013

ఐ లవ్ యూ!!...

Image
ఒకడు పువ్వు ఇస్తాడు, ఇంకొకడు రింగు ఇస్తాడు. మరొకడు ఫోనిస్తాడు, వేరొకడు పార్టీ ఇస్తాడు. ఆ మధ్య ఒకడు కారిచ్చాడు. ఆ మరుసటి రోజే ఇంకోడు కార్డిచ్చాడు. పోయిన ఆదివారం, నా స్నేహితుడొకడు దీన్ని గురించి మంచి ఐడియా ఇచ్చాడు( సోమవారం దానిపై పెద్ద లెక్చరు కూడా ఇచ్చాడు). ఇవన్నీ తెలిశాక మా పక్కింటోడు కంగార్లో, తన జీవితమే ఇస్తానని మాటిచ్చాడు. ఏది ఏమైనా, ఈ ప్రపంచంలో "ఐ లవ్ యూ" అనే మూడు ముక్కలు చెప్పడానికి మాత్రమే ఇన్ని రకాల అవకాశాలున్నాయనుకుంటా బహుశా! - బాలు

ఒరేయ్ సుబ్బారావ్!!...

Image
నాకు సుబ్బారావ్ మీద పీకల్దాకా , ఇంకా చెప్పాలంటే నడినెత్తి దాకా కోపం వచ్చింది . అసలు అలా ఎలా అనగలిగాడు వాడు ? అని నా బుర్ర అరిగేదాకా ఆలోచించినా అర్థం కాలేదు . ఏంటో వాడు ఆ మాట అన్నప్పటి నుండి నా మనసు మనసులో లేదు . అయినా మనిషంత మనిషిని నన్ను ఎదురుగా పెట్టుకొని అంత మాట అనడానికి ఆ మనిషికి అంత ధైర్యమేమిటో ? బహుశా అతనికి క్రితం రోజు తగిలిన లక్ష రూపాయల లాటరీ ప్రభావమేమో ! కాదు కాదు అది ఖచ్చితంగా అంతకుముందు పక్కవీధి మందులకొట్టులో ( అంటే ' మెడికల్ షాప్ ' కాదు ‘ మందు కొట్టే ’ కొట్టు ) కొట్టిన వంద రూపాయల ప్రాంతీయ సరుకు ఇచ్చిన బలమేనని నా గఠ్ఠి నమ్మకం . లేకపోతే అంత తెగువ అతనికెక్కడిది ?. అసలు నాకొచ్చిన కోపానికి అతణ్ణి అక్కడే తన్నేవాన్ని , కానీ నా స్నేహితుడు అడ్డుపడటంతో బ్రతికిపోయాడు . ఇంటికి వచ్చాక కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నా కూడా నన్నెవరూ ఏమైందని అడగలేదు . దాంతో నా కోపం రెట్టింపయింది . కానీ వెంటనే ' ఇంట్లో ఎవరూ లేకపోతే ఎలా అడగగలరు ’ అన్న మహత్తర విషయాన్ని కనుగొన్నాను . ఇంత

'క్కా'కి గోల..!

Image
నిన్న సాయంత్రం మా పక్క వీధిలో కుక్కలు వెంటపడితే నా పిక్కబలం చూపించి, దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ, కంగారులో మా పక్కింట్లో దూరాను.. అక్కడ నాకీ మాటలు వినిపించాయ్. “ఒరేయ్   బక్కచిక్కిన   తిక్కబావా !  నేనిక్కడ   పిలుస్తుంటే అలా   చెక్కల   చాటునా,   పక్కల   మాటునా   దాక్కుంటావేట్రా ?  నీ   దిక్కుమాలిన   చుక్కలు   లెక్కపెట్టే పనిని   పక్కన   పెట్టి   ఒక్క   నిముషం   ఇక్కడకువస్తే   చక్కని ముక్క   ఒకటి   నీ   చెవిన   వేస్తా .  ఎక్కడెక్కడ   వెతికినా,   నీ   తిక్కను   చూసి   ఒక్కరంటే   ఒక్కరు…   ఏమిటి   అర్థమైందా ?   ఒక్కరు   కూడా   మా   అక్క   అవడానికి   ఒప్పుకోలేదురా. చివరికి   పెక్కు   నక్కజిత్తులు   వేసి, కుక్కలపాలెం నుండి   బహుటక్కులమారి   అయిన,   జక్కన   చెక్కిన   బొమ్మవలె   మిక్కిలి   అందమున్న   ఒక   చక్కని   చుక్కను     తెచ్చాను .  ఇక   ఎన్ని   ఇక్కట్లు   వచ్చినా,   పక్కవీధిలోని ...  ఒరేయ్ !  వింటున్నావా?   పక్కవీధిలోని  ' హుక్కా   తాగే     దుక్కలాంటి   బుక్కన్న’గారి   చెక్కల   భవంతిలోనే   నీ   పెళ్లి   చేస్తానని   ఈ   తక్కెడ   తాతారావ్   చొక్కా   చింపి   మరీ   శపథం   చేస్తున