నీ కోసం... నీ ప్రేమ కోసం....

నే ఎదురుచూస్తున్నా.... చూస్తూనేఉన్నా ... నువ్ మాత్రం నను మరచిపోయావ్, మరలిపోయావ్. ఏ క్షణమైనా కరుణిస్తావనుకున్నా... నువ్ లేకపోతే అంతా శూన్యం . ఒక్క క్షణం కూడా,నిను మరచినది లేదు.నీకోసం తపించనిది లేదు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం మనం . నవ్వుల ముత్యాలు, చూపుల బాణాలు ... స్పర్శ లో పులకింత , నిద్దుట్లో కలవరింత... ఎన్ని ఊసులు చెప్పుకున్నాం , ఎన్ని రహస్యాలు విప్పుకున్నాం . కొమ్మ మీద పక్షి జంటని చూసి ఒకే గూటి పక్షులని నవ్వుకున్నాం. గాలి చల్లగా వీస్తే మనకోసమే అని మురిసిపోయాం. వర్షం మనల్ని పలకరించడానికే వస్తోందనుకున్నాం . ఎన్ని తీపిగురుతులని చెప్పను. ఎలా మరచిపోయావ్ ? నా ప్రేమసామ్రాజ్యం లో తిరిగి ఎప్పడు ఉదయిస్తావ్ ... నెలలా...సంవత్సరాలా... నే ఎదురుచూస్తూనే ఉంటా.... నీ కోసం. ------------------------------------------------------------