Posts

Showing posts from February, 2017

పే...ద్ద దోశ!!

Image
సంక్రాంతి పండుగకని ఇంటికి వెళ్ళాను. ఇంటి బయట ఆటో దిగగానే సీరియస్ గా  ఓ లుక్ ఇచ్చింది అమ్మ. చెన్నై నుంచి మల్లీ ఇంటికి రావడానికి రెండు నెలలు పట్టింది. అందుకే అమ్మ చాలా కోపం గా ఉంది . అదేంటో, అమ్మ కోపం లో బోలెడంత ప్రేమ కూడా ఉంటుంది. అందుకే, నేను ఫ్రెష్ అయ్యే లోపు బ్రూ కాఫీ రెడీ గా ఉంది. అమ్మ కోపం లాగె కాఫీ కూడా చాలా వేడి గా ఉంది.  కాఫీ తాగేంత సేపు లేదు, అమ్మ కోపం. భుజం మీద గాట్టిగా ఒక్కటిచ్చి, "ఇంకో వారం చూసి, మేమె వచ్చేవాళ్ళం చెన్నై కి" అని నవ్వేసింది. ఉదయాన్నే చల్లటి నీటి తో మొహం కడుక్కొని, పొగలు కక్కుతున్న కాఫీ తాగడం లో ఉన్న సంతృప్తి ఇంకేదాంట్లో దొరకదేమో. అదీ అమ్మ చేతి కాఫీ.. <3. చిక్కటి కాఫీ గొంతులో వెళ్తుంటే...గుటక గుటక కి కళ్ళు మూసుకొని... వేడి పొగ ను ఆస్వాదిస్తూ... ఆ తియ్యదనం నోటి లో ఇంకిపోతుంటే ...దీని కోసమే ప్రతి రోజు పని వదిలేసి ఇంటికి వచ్చేయచ్చు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ ని పోల్చడానికి ఏ గొప్ప విషయం సరిపోదు. వాటికవే సాటి. నాన్న బయట 'ఈనాడు' చదువుతూ ఉన్నాడు. అమ్మ టిఫిన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. నేను టీవీ చూడ్డం మొదలుపెట్టా. ఏవో సినిమా పాటలు వస్తున్నాయ్. చిన్