అందంగా అంటే చాలా అందంగా ......

తనని చూడడం అదే మొదటిసారి నాకు. canteen బయటున్న చెట్టు క్రింద, ప్రశాంతంగా కుర్చీ లో కూచుంది,ఒంటరిగా . తను చాలా అందంగా ఉంది . అందంగా అంటే చాలా అందంగా ...... వర్షం పడిన తరువాత తడిసి మెరిసిపోతున్న ముద్దబంతి లాగా ,s.p.బాలు గాత్రం నుంచి జాలువారిన ప్రేమ గానం లాగా, ఇంకా ఇంకా ..... అలానే చూడాలనిపించేంతగా ...... ఇంతలో order చేసిన కాఫీ వచ్చింది . కాఫీ ని ఆస్వాదించడం అంటే ఏంటో అప్పుడే తెలిసింది నాకు . అలానే చూస్తుండడం వల్లనేమో, తన ముఖ కవలికలు కూడా బాగా తెలుస్తున్నాయ్ . అప్పుడే అర్థమైంది నాక్కూడా ..... తన కళ్ళలో నీళ్ళు ,మొహం లో బాధ . అన్నటు చేతిలో ఏదో chain కూడా ఉంది . అలాంటి అమ్మాయి ఏడిస్తే ఓదార్చకుండా ఉండలేని అబ్బాయి ఉండడేమో . తన దగ్గరకి వెళ్లి మాట్లాడేంత సాహసం చేయలేదు కానీ, తన కోసం ఒక కాఫీ order చేశా .... ఎందుకో అలా చేయలన్పించింది . తన కళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నాయ్ , దేన్నో వెతుకుతున్నట్టు . తనకు కూడా కాఫీ సర్వ్ చేశారు . "ఎవరు " కళ్ళతోనే అడిగింది . సర్వర్ నా వైపు చూశాడు . వెంటనే తను కూడా . నేను తన దగ్గరకి వెల్లకతప్పలేదు ....