అందంగా అంటే చాలా అందంగా ......

తనని చూడడం  అదే మొదటిసారి నాకు. canteen బయటున్న చెట్టు క్రింద, ప్రశాంతంగా కుర్చీ లో కూచుంది,ఒంటరిగా  . తను చాలా అందంగా ఉంది . అందంగా అంటే చాలా అందంగా ...... వర్షం పడిన తరువాత తడిసి మెరిసిపోతున్న ముద్దబంతి లాగా ,s.p.బాలు గాత్రం నుంచి జాలువారిన ప్రేమ గానం లాగా, ఇంకా ఇంకా ..... అలానే చూడాలనిపించేంతగా ...... ఇంతలో order చేసిన కాఫీ వచ్చింది . కాఫీ ని ఆస్వాదించడం అంటే ఏంటో అప్పుడే తెలిసింది నాకు . అలానే చూస్తుండడం వల్లనేమో, తన ముఖ కవలికలు కూడా బాగా తెలుస్తున్నాయ్ . అప్పుడే అర్థమైంది నాక్కూడా ..... తన కళ్ళలో నీళ్ళు ,మొహం లో బాధ . అన్నటు చేతిలో ఏదో chain కూడా ఉంది .
అలాంటి అమ్మాయి ఏడిస్తే ఓదార్చకుండా  ఉండలేని అబ్బాయి ఉండడేమో . తన దగ్గరకి వెళ్లి మాట్లాడేంత సాహసం చేయలేదు కానీ,  తన కోసం ఒక కాఫీ order చేశా .... ఎందుకో అలా చేయలన్పించింది . తన కళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నాయ్ , దేన్నో వెతుకుతున్నట్టు .

   తనకు కూడా కాఫీ సర్వ్ చేశారు .
 "ఎవరు " కళ్ళతోనే అడిగింది .
సర్వర్ నా వైపు చూశాడు . వెంటనే తను కూడా .
నేను తన దగ్గరకి వెల్లకతప్పలేదు .
"sorry , thanks " మళ్లీ కళ్ళతోనే .
"its ok , it will make you feel good ." నేను .
కొద్దిసేపు మౌనం .
తను కాఫీ తీస్కుంది . నేను కూడా  అక్కడే కూర్చున్నా .
"నా sweety  తప్పిపోయింది. my pet dog . అదంటే నాకు చాలా ఇష్టం  ". తనే మొదలుపెట్టింది .
అప్పుడే విన్నా తన voice ని. తన sweety ఏమోగాని , తన voice మాత్రం చాలా sweet గా ఉంది , లేత పూవుల్తో చెంప మీద రాసినట్టు . తన కళ్ళు ఎటో తిరుగుతున్నాయ్ , ఇంకా వెతుకుతూనే  ... నా  కళ్ళు మాత్రం తననే చూస్తున్నాయ్ .
చల్లగా గాలి , అలలు అలలు గా  తన కురులు . తను దగ్గరనుంచి ఇంకా అందంగా ఉంది .

తనతో ఏదో ఒకటి మాట్లాడాలి . కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు .
" కాఫీ ఎలా ఉంది ? "
తను ఏమి చెప్పలేదు  కానీ , కళ్ళతోనే బాగానే ఉంది అని చెప్పినట్టు అనిపించింది .
తను కళ్ళ తోనే చెప్పిందో లేక తన కళ్ళ లోకే చూస్తుండడం వల్ల నాకలా అన్పించిందో అర్థంకాలేదు .
" sweety ఎందుకు వెల్లిపోయింది ... ? "  ఎందుకో అడిగా ...
" పొద్దున్నే నాతో పాటు ఆడుకోలేదని దాన్ని బాగా తిట్టాను . అది అలిగి వెల్లిపోయింది "
కుక్క పిల్ల ను తిట్టడం ఏంటో , అది అలిగి వెళ్ళిపోవడం ఏంటో అర్థం కాలేదు .
అర్థం కాని వాళ్ళే అమ్మాయిలని మాత్రం అర్థమైంది .
" వస్తుందిలే , బాధ పడకు ... " .
అలా చెప్పానో లేదో ... ఇలా ఎగురుతూ వచ్చింది sweety ... ఎకడ్నుంచి  వచ్చిందో ఏమో ....
sweety వచ్చినందుకు తను సంతోషపడ్డా .. నేను మాత్రం చాలా బాధ పడ్డా .
" bye bye . thanks for the coffee ". తను వెళ్ళిపోతూ......
నేను మాత్రం వెళ్ళిపోతున్న తననే చూస్తూ .....................

------------------------------------------------------------------------------------------------------


Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక