ఏ మాయ చేసావే.. !?


నాకు తెలీకుండానే నా మనసు నీ ఊహల్లో మునిగిపోతోంది...

ఎవరిని చూసినా నా కళ్ళలో నీ రూపమే నిండిపోతోంది...

క్షణమైనా తీరిక లేకుండా గుండెలో నీ పేరే మోగుతోంది...

మేని అలసట మరిచి నీ ఊసులనే కలవరిస్తోంది...

సుతిమెత్తటి గాలి తాకినా సున్నితమైన నీ స్పర్శ లాగే ఉంది...

దేహం గురుత్వాకర్షణ కి లొంగక గాల్లో తేలుతోంది...

నా ప్రతి ఆలోచన నువ్వై మెదడు లో చిన్ని తుఫానే రేగుతోంది...

నే చేసే ప్రతి పనీ అసంకల్పితం గా నీకై చేయాలనిపిస్తోంది...

వేసే ఒక్కో అడుగు నన్ను నీ వైపే లాగుతోంది...

మోము పై ఆగని చిరునవ్వు కి కారణం నీవే అనిపిస్తోంది...

ఈ దూరం మరింత దగ్గరయ్యేందుకు విరహం తో ఎదురుచూస్తున్న మనసు..
ఏం మాయ చేసావో చెప్తే... కాస్త కుదుటపడుతుంది...

-శ్రీ



Comments

Post a Comment

Popular posts from this blog

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones