ఐ టి ఉద్యోగులు - రకాలు (సరదా కి )

ముందు మాట: ఇక్కడ IT ఉద్యోగులు అంటే income tax వాళ్ళు కాదు. software ఉద్యోగులు అని. 1. mr. పర్ఫెక్ట్ : వీళ్ళు అన్నిట్లోను పర్ఫెక్ట్. వీల్ల లాంటి వాళ్ళు ఆఫీసు లో చాలా తక్కువ. చాలా నీట్ గా pressed షర్టు, టక్ ఇన్ చేస్కొని, పక్కా ఫోర్మల్స్ లో ఉంటారు. ఆఫీసు కి వచ్చామా పని అయ్యిందా ఇంటికి వెళ్ళామా .అంతే. పక్క వాళ్ళని గెలకడం అంటే వీళ్ళకు అస్సలు తెలీదు. వీళ్ళ గురించి మనకు పెద్ద గా తెలీదు :P 2. biscuit batch : ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ళనే soap రాజ అని కూడా అంటారు. ఎప్పడు TL కి, మేనేజర్ కి biscuit లు వేస్తూ ఉంటారు. వీళ్ళ పని ఆఫీసు లో వర్క్ చేయడం కాదు, కనిపించిన వాళ్ళని పొగడడం. వీళ్ళ టైం అంతా బాస్ భజన చేయడానికే సరిపోతుంది. అంతే కాక తరుచు బాస్ కి పార్టీ లు, ఇంట్లో కలిసి క్రికెట్ మ్యాచ్ లు చూడ్డాలు జరుగుతుంటాయి. ఎప్పుడు మేనేజర్ తో పాటే ఉంటారు, తింటారు. వీళ్ళకి వర్క్ చేయకపోయిన మంచి రేటింగ్స్ వస్తాయి. 3. సొల్లు మారాజు: వీళ్ళకి nonstop గా మాట్లాడడం బాగా తెల్సు. కాని...