ఐ టి ఉద్యోగులు - రకాలు (సరదా కి )

ముందు మాట: ఇక్కడ IT ఉద్యోగులు అంటే income tax వాళ్ళు కాదు. software ఉద్యోగులు అని. 


1. mr. పర్ఫెక్ట్  : 

వీళ్ళు అన్నిట్లోను పర్ఫెక్ట్. వీల్ల లాంటి వాళ్ళు ఆఫీసు లో చాలా తక్కువ. చాలా నీట్ గా pressed షర్టు, టక్ ఇన్ చేస్కొని, పక్కా ఫోర్మల్స్ లో ఉంటారు. ఆఫీసు కి వచ్చామా పని అయ్యిందా ఇంటికి వెళ్ళామా .అంతే. పక్క వాళ్ళని గెలకడం అంటే వీళ్ళకు అస్సలు తెలీదు. వీళ్ళ గురించి మనకు పెద్ద గా తెలీదు :P





2. biscuit batch : 

ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ళనే soap రాజ అని కూడా అంటారు. ఎప్పడు TL కి, మేనేజర్ కి biscuit లు వేస్తూ ఉంటారు.  వీళ్ళ పని ఆఫీసు లో వర్క్ చేయడం కాదు, కనిపించిన వాళ్ళని పొగడడం.  వీళ్ళ టైం అంతా బాస్ భజన చేయడానికే సరిపోతుంది. అంతే కాక తరుచు బాస్ కి పార్టీ లు, ఇంట్లో కలిసి క్రికెట్ మ్యాచ్ లు చూడ్డాలు జరుగుతుంటాయి. ఎప్పుడు మేనేజర్ తో పాటే ఉంటారు, తింటారు. వీళ్ళకి వర్క్  చేయకపోయిన మంచి రేటింగ్స్ వస్తాయి.





3. సొల్లు మారాజు:

వీళ్ళకి nonstop గా మాట్లాడడం బాగా తెల్సు. కాని ప్రాబ్లం ఏంటంటే, అది ఏ మాత్రమూ ఇంటరెస్టింగ్ గా ఉండదు. పొరపాటున వీళ్ళతో లంచ్ కి వెల్లామో, ఆకలి చచ్చ్చి, తల పగిలిపోద్ది. అంతా అయిపోయాక, "వావ్ ఎంత బాగా చెప్పారు" అని ఒక నవ్వు విసరాలి. లేకపోతె హర్ట్ అయిపోతారు. ఆఫీసు లో వీళ్ళ పక్కన కూర్చుంటే రోజంతా సొల్లు, సాయంత్రం పనవ్వలేదని మేనేజర్ గాడి తిట్లు. ఒకవేల మీ టీం లో ఇలాంటి వాడుంటే, saradon , zandoobalm లాంటివి మీ  డెస్క్ లో స్టాక్ పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది.




4. లడ్డూ బాబులు :

 వీళ్ళకి ఆఫీసు కి ఇంటికి పెద్ద తేడా ఉండదు. ఎక్కడైనా తినడమే పని. వీళ్ళు ఏం చేస్తున్న తినడం అనే ఇంకో పని పార్లల్ గా చేస్తుంటారు. ఏరోజు ఏ కేఫ్ లో ఏంటి స్పెషల్ అనే విషయాలు బాగా గుర్తుంటాయ్ వీళ్ళకి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్. దానికి ముందో కాఫీ తర్వాత ఓ కాఫీ. లంచ్ బ్రేక్ కి పోయే ముందే ఇంకో చిన్న బ్రేక్, స్నాక్స్ కోసం. మల్లి ఈవెనింగ్ 4 కి టీ బ్రేక్, ఈ బ్రేక్ లో టీ తో పాటు, biscuits , సమోసా, పాని పూరి లాంటి చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్. అస్సలు వీళ్ళు తింటూ పనిచెస్తారో, పని చెస్తూ తింటారో ఎవరకి అర్థం కాదు. వీళ్ళలో ఉండే మచి గుణం ఏంటంటే వీళ్ళతో పాటు, వీళ్ళ టీం మేట్స్ కి కూడా స్నాక్స్ తెస్తారు :) . 




5. రొమాంటిక్ రోమియోస్:

సగటు IT జనాభా లో వీళ్ళు చాలా మందే ఉంటారు. అస్సలు వీళ్ళ వల్లే కుర్రాళ్ళు అందరు (atleast కొంతమందయినా ) ఈ ఫీల్డ్ లోకి రావలనుకుంటారు. ఆఫీసు, కాంటీన్, బయట hostels , ఎక్కడ చూడు వీళ్ళే. ఎప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్ తో మాత్రం, వాళ్ళే వీళ్ళ చుట్టు తిరుగుతుంటారు అని చెప్తుంటారు, వీళ్ళలో సగానికి సగం మంది " స్నేహితులు గా మిగిలిన ఒక వైపు ప్రేమికులు " అంటే friend zoned onside lovers అన్నమాట. అమ్మాయిలకి(boyfriend లేని) షాపింగ్ లకి, ఎప్పుడైనా సినిమా లకి పోవాలంటే వీళ్ళే దిక్కు.




6. gym బాయ్స్: 

వీళ్ళు పొద్దున్నే ఏడింటికే ఆఫీసు కి వచేస్తారు( ఎలా లేస్తారో మరి ). ఒక రెండు గంటలు ఆఫీసు లో gym చేసేసి, అక్కడే స్నానం చేసేసి, తీరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చేసి, ఆఫీసు లోకి ఫ్రెష్ గా ఎంటర్ అయి, సిస్టం ఆన్ చేసి, లాగిన్ అయి, onsite లో మేనేజర్ కి గుడ్ నైట్ (మనకు పొద్దునే, వాళ్ళకి సాయంత్రం కదా ) చెప్పి, వీళ్ళు కూడా పడ్కుంటారు. రేయ్ ఇదొక్క ప్రోగ్రాం రాసిపేట్రా అని అడిగితె,  "పో బేయ్, ఇంకో గంట తర్వాత చేస్తాలే , పొద్దునే ఏడుకే లేచా, బాగా నిద్రొస్తోంది" అని బాగా మర్యాద గా చెప్తారు. ఏది ఎలా అన్నా తగలడనీ, డైట్ విషయం లో, gym టైమింగ్ విషయం లో మాత్రం పక్కా గా ఉంటారు. ఈవినింగ్ క్లైంట్ మీటింగ్ ఉన్నా సరే, మిగిలిన వర్క్ అంతా ( అంతా మిగిలే ఉంటుంది ) మన మీద వేసి ఆరు కి చక్కా పోతారు, gym కి. 





7. బెంచ్ గ్యాంగ్ : 

వీళ్ళకి చాలా పేర్లున్నాయ్. బెంచ్, ఫ్రీ పూల్, నాన్ బిల్లబల్, రిజర్వు, (ఆఫీసు లో ప్రాజెక్ట్ లేకుండా ఖాలీ గా ఉండే వాళ్ళని ఇలా అంటారు,)...  ఇలా. వీళ్ళు, ఆఫీసు లో కాకుండా, కాంపస్ లోని చెట్ల కింద పుట్ల కింద ఉంటారు. ఎంత సేపనీ ఇలా ఉంటారు చెప్పండి, అందుకే కాంటీన్ లో కూడా కొంచెం ఎక్కువ సేపు ఉంటారు. వీళ్ళకి పెద్ద పనేమీ ఉండదు ( అస్సలు పనేమీ ఉండదు). పొద్దున్నే ఆఫీసు కి వచ్చి swipe చేయాలి. మల్లి ఈవెనింగ్ వెళ్ళిపోతూ swipe చేయాలి. అప్పుడప్పుడు వీళ్ళ పరిస్థితి కొంచెం కష్టం గా ఉంటుంది, ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్న ఫ్రెండ్ కి లంచ్ బ్రేక్ లోను, టీ బ్రేక్ లోను, కంపెనీ ఇవ్వల్సొస్తుంది. ఎవడయినా నాల్రోజులు ఇంటికి వెళ్తే, నీ కార్డు తో పాటు నా కార్డు కూడా swipe చేయరా అని కార్డు వీళ్ళ మొహాన కొట్టేసి పోతారు. కాని, ఫ్రీ పూల్ లో ఉన్న ఆ ఎంజోయే వేరబ్బా. :)





8. కక్కుర్తి కాంతా రావులు : 

వీళ్ళు ఆఫీసు కి వచ్చేది, వర్క్ చేయడాన్కి కాదు, ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాఫీ, ఫ్రీ వైఫై కోసం. ఎప్పుడూ సిస్టం లో youtube , ఫోన్ లో ఆప్ downloads , పక్కనే కప్ లో కాఫీ. అప్పుడప్పుడు వీకెండ్స్ లో కూడా వీళ్ళు ఆఫీసు కి వెళ్తారు. ఏంట్రా వర్క్ అంటే అంత ఇంటరెస్ట్ ఆ, సండే కూడా ఆఫీసు కి వచ్చావంటా అని అడిగామనుకోండి, ఏం లేదు బావ నా ఫోన్ కి lollipop వెర్షన్ అప్డేట్ వచ్చింది, డౌన్లోడ్ చేద్దామని వచ్చా అంతే అంటారు. పొరపాటున ఆఫీసు లో నెట్ వర్క్ చేయకపోతే, అయ్యయో ప్రోడక్ట్ delay అవుతుందని  కాదు వీళ్ళ బాధ. ఆ రోజు కామెడీ నైట్స్ విత్ కపిల్ మిస్ అయిపోతుందని. మాములుగా వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే," ఆ బ్యాంకు ప్రాజెక్ట్ దగ్గర కాఫీ బావుంటుంది తెల్సా, ఇకడ సిగ్నల్స్ సరిగా రావట్లేదు రా, ఆ మూల ఐతే వైఫై సూపర్ గా తగుల్తుంది. ఎందుకో ఈ మద్య ఫేస్బుక్ బ్లాక్ చేసారు, ఫేస్బుక్ లేకుండా ఎలా వర్క్ చేయాలో ఏంటో".  ఇలా ఉంటాయి.





9. ఓవర్ ఆక్షన్ టీం: 

వీళ్ళంతా నేల మీద అసలు ఉండరు. పొరపాటున మేనేజర్ ఆఫీసు కి రాక పొతే ఓ హడావిడి చేసేస్తారు, వెంటనే మేనేజర్ కి కాల్ చేసేసి, " ఏమైంది సార్, అంతా ఓకే కదా, వచ్చ్చేప్పుడు ఏ ఆక్సిడెంట్ ఓ అయి పోలే కదా, మీరు లేకుండా నేను ఈ టీం ని maintain చేయలేను సార్.త్వరగా వచ్చేయండి " అని టీం బరువు బాద్యతలు మీదేసేస్కుంటారు. ఇంకా మేనేజర్ కి ఆరోగ్యం బాలేదని తెలియాలీ, కంపెనీ CEO చచ్చి పోయిన రేంజ్ లో సీను. వీళ్ళు చేసేది వాటర్ బాటిలు, చెప్పేది బీర్ బాటిలు. ఎవరైనా "ఎలా చేశావయ్యా ఇది. ఇంత బాగా వచ్చింది" అని అడిగితె చాలు. "ఒక వారం నుంచి రాత్రిమ్బవ్వలు తిండి తిప్పలు మాని చేశా తెలుసా" అంటారు. వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పిన ఓవర్ గానే ఉంటుంది.





10. అత్తెసరు IT గాళ్ళు : 

( ఈ టైటిల్, చేతన్ భగత్ పుస్తకం five point someone తెలుగు వెర్షన్ - IIT లో అత్తేసరుగాల్లు  నుంచి కొట్టేశా :P) 
వీళ్ళకి ఈ జాబ్ ఎలా ఎందుకు వచ్చిందో తెలీదు. అస్సలు ఎలా వచ్చిందో తెలీదు. నాకు తెలిసినంత వరకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి - recruiter నైట్ అంతా నిద్ర లేక (పోలేక ) పొద్దునే ఇంటర్వ్యూ చేసేటప్పుడు నిద్రపోయి ఉండవచ్చు. రెండు - నైట్ ఫుల్ గా వేసి, పొద్దునే కూడా వేసి, ఇంటర్వ్యూ చేసినప్పుడు. వీళ్ళకి ఏది ఎప్పుడూ వాడాలి, ఎలా వాడాలి అనే సామాజిక స్పృహ ఉండదు. వీళ్ళ మీద చాలా జోకులే ఉన్నాయి. మచ్చుకు ఓ రెండు. " ఫుల్ స్క్రీన్ కోసం F5 నొక్కండి అంటే F కీ ని 5 కీ ని నొక్కాడంట వెనుకటికి ఒకడు " " ఇంకొక మహానుభావుడి కోచ్చిన అద్భుతమైన సందేహం - డేటా స్టోర్ చేసేకోద్ది, కంప్యూటర్ వెయిట్ పెరుగుతుందా అని? " ఇలాంటి వాళ్ళు IT లో చాలా అవసరం. 




11. చదువు బిడ్డలు : 

వీళ్ళు కొంచెం తెలివైన వాళ్ళే అని చెప్పుకోవాలి. కంపెనీ లో వర్క్ చేస్తూ( చేసినా, చేయక పోయిన నెలనెలా శాలరీ తీస్కుంటూ) పైచదువుల కోసమో లేక గవర్నమెంట్ ఉద్యోగాల కోసమో చదువ్కుంటూ ఉంటారు. పొద్దున్నే ఆఫీసు కి రాగానే ఇంకో టీం మేట్ తో, "మామా, ఈ రోజు వర్క్ నువ్ కవర్ చెయ్, నేను ఈ బ్యాంకు ఎగ్జామ్స్ కి లాజికల్ రీజనింగు చదువ్కోవాలి" అంటారు. " వర్క్ ఎంత వరకు వచ్చిందయ్యా " అని మేనేజర్ గాని అడగితే, " మొన్నే సార్, గేట్ ఎగ్జామ్ రాసా, రిజల్టు రావడాన్కి ఇంకో నెల పట్టచ్చు" అని నాలిక్కరుచుకుంటారు.   వీళ్ళకి ఎప్పుడు ఏ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ పడ్తుంది, ఏ నెల లో ఏ గవర్నమెంట్ జాబ్స్ పడతాయి లాంటి విషయాలు కంట్టతః  ( ఒత్తు ట ఎలా రాయాలో తెలీదే) తెలుసు. 


12. బ్రాండ్ ఫ్రీక్స్: 

చేతికి gucci వాచ్, లెవిస్ పాంట్స్, బేసిక్స్ ఫోర్మల్స్, converse షూస్,.... ఇలా .... మాస్ సినిమా లో 'అన్న అడుగేస్తే మాస్, అన్న నడిచొస్తే మాస్...' అన్నట్టు వీళ్ళు నోరు తెరిస్తే బ్రాండ్, ఓ లుక్కిస్తే బ్రాండ్, అడుగేస్తే బ్రాండ్. వీళ్ళకి ప్రపంచం లో ఏదైనా కేవలం రెండు రకాలు. బ్రాండ్. నాన్ బ్రాండ్. ఆఫీసు లో వర్క్ చేయాలంటే ఆపిల్ మాక్ ఉండాలి, లంచ్ కి KFC , Mc.Donalds కి పోవాల్సిందే. ఫోన్ వెనుక కొంచెం కొరికేసిన ఆపిల్ బొమ్మ ఉండాల్సిందే. వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, " బావా, మొన్న షోడా (తాగే షోడా కాదు, తిరిగే Skoda ) లో వెళ్తుంటే రోడ్డు పక్కన సడన్ గా పీటర్ ఇంగ్లండ్స్ చూసారా, కొత్త గా ఓపెన్ చేసారంట. నీకు తెలుసు కదా పీటర్ ఇంగ్లండ్స్ అంటే నాకు ఎంత ఇష్టమో , వెంటనే వెళ్లి నాలుగు పెయిర్స్ కొన్నా. ఓన్లీ పది వేలే అంట, 20 % డిస్కౌంట్ ".  వీళ్ళని పట్టడం మన వాళ్ళ కాదు. 




13. సామాన్య జనాభా :
మనం చూసే వాళ్ళలో చాలా మంది వీళ్ళే. ఏదో తెల్లారిందా, భారం గా లేచామా, స్నానం కానిచ్చమా, రెండు దోశలు తిన్నామా, ఆఫీసు కి పోయామ అన్నట్టు ఉంటారు. ఏది పెద్ద  సీరియస్ గా తీస్కోరు. మేనేజర్ గాడు పొగిడిన ఒకటే నవ్వు తిట్టినా ఒకటే నవ్వు. " ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ? మనం కేవలం నిమిత్త మాత్రులం " అనే ఫిలాసఫీ ని బలం గా నమ్ముతారు. దాదాపు మనమందరం ఇలాంటి వల్లే.





ఇది కేవలం సరదాకి మాత్రమె. దయచేసి సీరియస్ గా తీస్కోకండి :) . 

Share the happiness by sharing this with your IT friends.


Comments

  1. కిరణ్ కుమార్ కే31 March 2015 at 00:18

    ఒక వేల ఈ టపాను సీరియస్ గా తీసుకుంటే నేను
    13. సామాన్య జనాభా :
    కి చెందుతాను.

    6. gym బాయ్స్: కాటగిరికి వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన.

    ReplyDelete
    Replies
    1. హహా... 6. gym బాయ్స్ కూడా పర్లేదు లెండి. వాళ్ళు సామాన్య జనాభా తర్వాత సామాన్య జనాభా లాంటి వాళ్ళు.

      Delete
  2. మరిన్ని కథలు, వార్తలు చదవండి కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News

    ReplyDelete
  3. 64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai). Just open below site to know full details.
    http://goo.gl/FNmtFq

    ReplyDelete
  4. mee blog bagundhi
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక