నా నుంచి దూరం వెళ్ళకు ప్రియా.........

శిశిర తయారవుతోంది . తను, కార్తీక్ ను కలవడానికి వెళ్తోంది . ఐదు నిమిషాల క్రితమే కార్తీక్ కాల్ చేసాడు. ఏదో మాట్లాడాలని చెప్పాడు. తను కార్తీక్ తో గొడవపడింది క్రితం రాత్రి. శిశిర కార్తీక్ ను ప్రేమించింది. కానీ ఇప్పుడు కాదు. తనకి కార్తీక్ తో ఉండడం ఏ మాత్రమూ ఇష్టం లేదు. కార్తీక్ అన్ని తనకు వ్యతిరేకంగా చేస్తాడని శిశిర అభిప్రాయం.మూవీ కి వెళ్దామంటే వద్దు రెస్టారెంట్ కి వెళ్దాం అంటాడు . పోనీ సాయంత్రం అలా పార్క్ కు వెళ్దాం అంటే వద్దు గుడి కి వెళ్దాం అంటాడు . శిశిర కు ప్రేమంటే, చెప్పింది చేయాలి,అడిగింది కొనివ్వాలి, తనకు ఏమి నచ్చుతాయో అవే కార్తీక్ కు కూడా నచ్చాలి అంటుంది.కానీ కార్తీక్ అలా ఆలోచించడు . ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అంటాడు . ఆటో దిగి కార్తీక్ రూమ్ కి వెళ్ళింది శిశిర . తను కాఫీ తాగుతున్నాడు బాల్కనీ లో కూర్చొని. శిశిర తన దగ్గరికి వెళ్లి విసురు గా అడ్గింది . "ఎందుకు పిలిచావ్?" "నీతో మాట్లాడాలి శిశిర " కార్తీక్ గొంతులో బాధ, కళ్ళలో ఆర్ద్రం మాటల్లో తెలుస్తున్నాయ్. "సరే వింటాను , కానీ నా అభిప్రాయం మారదు కార్తీక్." మనిద్దరం విడిపోదాం అని క్రితం ర...