ఓ మిస్సమ్మా.......! (మహానటి సావిత్రిగారి జన్మదిన సందర్భంగా)
ఓ మిస్సమ్మా!
అందమనే పదం నీకోసమే పుట్టిందేమో!
నీవు నవ్వితే నవరత్నాలు నిస్సందేహంగా రాలునేమో!
నటనకు నడకలు నేర్పినది నీవేనేమో!
ఓ సావిత్రీ!
ఎక్కడని వెతకము నీకోసం
కానీ ఎక్కడా కనిపించవేం?
‘దేవదాసు’లో చూశాము, పార్వతియే కనిపించింది
‘కన్యాశుల్కం’ లోనూ , మధురవాణియే కవ్వించింది
‘మిస్సమ్మ’లో వెతికితే, మేరియే తారసపడింది
చివరికి,
‘మాయాబజార్’లోనూ గాలించాము, అక్కడా శశిరేఖయే ఎదురుపడింది
ఎక్కడెక్కడ వెతికినా సావిత్రి మాత్రం అగుపించలేదు
నీవు చేసిన పాత్రలే పలకరించాయి
ఓ రాధా!
‘సుందరీ!, నీవంటి దివ్యస్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా!’
‘నీవేనా నా మదిలో నిలచి, హృదయము కలవరపరచినది’
‘నా హృదయంలో నిదురించే చెలీ!’
ఇలా ఎన్నెన్నో రాగాలు, సరాగాలు నీ గురించి.
ఓ మధురవాణీ!
యుగాలు గడచినా, తరాలు మారినా
అందం, అభినయం కలబోసిన దేవత ఎవరంటే
మేము నీ పేరే చెబుతాం
ఎందుకంటే ,
ఓ మిస్సమ్మా!, మేము నీ అభిమానులం.
నీకు మేము మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. 
బావుంది మీ అభిమానం.కవిత కూడా..
ReplyDeletethank you chinni gaaru :)
Delete