నా నుంచి దూరం వెళ్ళకు ప్రియా.........

శిశిర తయారవుతోంది . తను, కార్తీక్ ను  కలవడానికి వెళ్తోంది . ఐదు నిమిషాల క్రితమే కార్తీక్ కాల్ చేసాడు. ఏదో మాట్లాడాలని చెప్పాడు. తను కార్తీక్ తో గొడవపడింది క్రితం రాత్రి. శిశిర కార్తీక్ ను ప్రేమించింది. కానీ ఇప్పుడు కాదు. తనకి కార్తీక్ తో ఉండడం ఏ మాత్రమూ ఇష్టం లేదు. కార్తీక్ అన్ని తనకు వ్యతిరేకంగా చేస్తాడని శిశిర  అభిప్రాయం.మూవీ కి వెళ్దామంటే వద్దు రెస్టారెంట్ కి వెళ్దాం అంటాడు . పోనీ సాయంత్రం అలా పార్క్ కు వెళ్దాం అంటే వద్దు గుడి కి వెళ్దాం అంటాడు . శిశిర కు ప్రేమంటే, చెప్పింది చేయాలి,అడిగింది కొనివ్వాలి, తనకు ఏమి నచ్చుతాయో అవే కార్తీక్ కు కూడా నచ్చాలి అంటుంది.కానీ కార్తీక్ అలా ఆలోచించడు . ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అంటాడు .

ఆటో దిగి కార్తీక్ రూమ్ కి వెళ్ళింది శిశిర . తను కాఫీ తాగుతున్నాడు బాల్కనీ లో కూర్చొని.
శిశిర తన దగ్గరికి వెళ్లి విసురు గా అడ్గింది .
"ఎందుకు పిలిచావ్?"
"నీతో మాట్లాడాలి శిశిర "
కార్తీక్ గొంతులో బాధ, కళ్ళలో ఆర్ద్రం మాటల్లో తెలుస్తున్నాయ్.
"సరే వింటాను , కానీ నా అభిప్రాయం మారదు కార్తీక్."
మనిద్దరం విడిపోదాం అని క్రితం రాత్రే తేల్చేసింది శిశిర .
 కార్తీక్ శిశిర  కు ఇద్దామని తెచ్చిన గులాబీ వాడిపోయింది , కార్తీక్ ముఖం పాలిపోయింది, శిశిర  కళ్లలో వేడికి.
తనకి శిశిర అంటే ప్రాణం. కానీ తను ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు. శిశిర అర్థం చెస్కోదు .
కార్తీక్ అడిగాడు." బయటికి వెళ్లి మాట్లాడుదాం.ఎక్కడికైనా."
" సరే "
"ఎక్కడికి వెళ్దాం?"
"నువ్వే చెప్పు?"
"నేనేం చెప్పినా , నువ్వు అనుకున్న చోటికే తిస్కేల్తావు కదా..."
ఇద్దరు బయల్దేరారు , కార్తీక్ బైక్ లో.
గుడి దగ్గర బైక్ ఆగింది.గుడి ప్రశాంతంగా ఉంది. కార్తీక్ మనసు లో సునామి.
ఇద్దరు మెట్ల మీద కూర్చున్నారు.
"నువ్వంటే ప్రాణం శిశిర ."
"లేదు కార్తీక్,నా మీద నీకు ప్రేమ లేదు.నీ  ఇష్టాలు వేరు ,నా ఇష్టాలు వేరు. మనం విడిపోదాం కార్తీక్."
సూర్యుడు శిశిర ని అర్థం చేస్కునట్టున్నాడు.ఎండ పెరిగింది.
కార్తీక్ కి ఏమి చెప్పాలో తోచడం లేదు . చెప్పాల్సిందంతా నిన్న రాత్రే చెప్పేశాడు.
శిశిర ఇక తన మాట వినదు.
"రా వెళ్దాం ..."
" నేను ఇకడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాను "
కార్తీక్ కి అర్థం అయిపోయింది .శిశిర  ఇక తన జీవితం లో లేదు.
తన జేబు లోంచి చిన్న చీటీ తీసి, తనకిచ్చి బైక్ వైపు వెళ్ళిపోయాడు.కార్తీక్ కి చుట్టూ ఏమి జరుగుతోందో ఏమీ కనబడట్లేదు .కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి .
బైక్ లో అలా వెళ్ళిపోతున్నాడు.నిస్తేజంగా....
ఈసారి విధి కార్తీక్ ని అర్థం చేస్కున్నట్టుంది.
పొద్దున్నే తాగున్నాడేమో , టాక్సీ డ్రైవర్ . ఏ మాత్రమూ తడబడకుండా నేరుగా కార్తీక్ ని గుద్దేశాడు.
ఆక్సిడెంట్ చుట్టూ జనం చేరారు.
శిశిర అలా చూస్తూ ఉండిపోయింది . కార్తీక్ తనకిచ్చిన చీటీ తెరిచింది .
"శిశిరా , నువ్వు, నీ ప్రేమ నా జీవితం లో లేకపోతె , నేను ఉన్నా చనిపోయినట్టే. "

------------------------------------------------------------------------------------------------------


Comments

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక