Ghost From The Mirror!

సాయంత్రం 7 గంటల ప్రాంతం లో అనుకుంటా, మేనేజర్ అర్జంట్ గా రమ్మని కాల్ చేస్తే ఆఫీసు కి వెళ్లాను. క్రిటికల్ అప్లికేషన్స్ కి సంబంధించిన డేటా ఇష్యూ. ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ కి నాకే కాల్ చేస్తాడు మా మేనేజర్. మాములుగా అయితే ఇంట్లో నే నా లాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యే వాడిని. కాని పవర్ మైన్టైనన్స్ వల్ల మధ్యాన్హం 2 గంటల నుంచి పవర్ లేదు. సరిత తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి వెళ్ళింది. నాక్కూడా ఒక్కడినే బోర్ కొడ్తోంది. అందుకని ఇంక ఆఫీసు కి బయల్దేరాను.

ఆదివారం కావడం తో రోడ్స్ అన్ని ఖాళి గా ఉన్నాయ్. పైగా మా ఆఫీసు ఉండేది సిటీ అవుట్ స్కర్ట్స్ లో. అయిదు లేదా పది నిమిషాలకి ఒకసారి ఎదురుగానో వెనుకనుంచో వచ్చే వెహికల్ సౌండ్స్.. హెడ్ లైట్స్ .. తప్ప మరో సౌండ్ కాని మూవ్మెంట్ కాని లేవు. నేను కూడా పెద్ద స్పీడ్ గా వెళ్ళట్లేదు. ఈ టైం లో తాగి నడిపే వాళ్ళు ఎక్కువ ఈ రూట్ లో.. అందుకనే 40 లో వెళ్తున్న. అమావాస్య కాకపోయినా అమావాస్య అంత చిమ్మచీకటి గా ఉంది చుట్టూ. రోడ్ వంపుల దగ్గర హెడ్ లైట్స్ పడి ఎదురుగా చీకట్లో ఉన్న చెట్లు వింత ఆకారాల్లో ఉన్న దయ్యాల్లాగా అనిపిస్తునాయ్. లైట్ వాటి మీద పడి వాటి షాడోస్ లైట్ కి ఆపొసిట్ లో మూవ్ అవ్తూ ఉంటె దయ్యం చేతులు గాల్లో ఊపుతూ నన్ను భయపెడుతునట్టు ఉంది. కారు లోపల లైట్ ఆపేసాను. రేడియో కూడా పని చెయ్యట్లేదు. కారు ఇంజిన్ శబ్దం కూడా ఆ చీకటి లో కలిసిపోయి, కారు వెనుక సీట్లోంచి నిశబ్దం శబ్దం చేసినట్టు గా వినిపిస్తోంది.

కారు లో AC ఆఫ్ చేసి, స్వచ్చమైన గాలి ని ఆస్వాదిద్దాం ని విండో మిర్రర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ఈ ఓల్డ్ కారు తో అదే ప్రాబ్లం..ఒక చేతో తిప్పితే విండో వీల్ తిరగదు.. బలం గా రెండు చేతులు పెట్టి తిప్పాలి. ఎదురుగా స్ట్రెయిట్ రోడ్. మోకాలి తో స్టీరింగ్ స్ట్రెయిట్ గ బాలన్స్ చేస్తూ.. రెండు చేతులుతో గట్టిగా తిప్పే సరికి వీల్ తిరిగింది.. మిర్రర్ కిందకి వస్తుంటే కార్ లోకి చల్ల గాలి నా ముఖాన్ని తగుల్తూ ప్రవేశించింది. వేగం గా ముఖానికి చల్ల గాలి తగిలేసరికి కళ్ళు ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యాయి. ఓపెన్ చేసేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని సడన్ గా ఒక కారు ఎగ్జాక్ట్ గా నా కారు కి 10 అడుగుల దూరం లో ఉంది. ఆ కార్ హెడ్ లైట్స్ కూడా ఆఫ్ లో ఉనాయ్. బహుశా అందువల్లే దూరం గా ఉన్నప్పుడు గుర్తించలేకపోయానేమో. కారు ని కంట్రోల్ చేసేలోపే ఆ కార్ వచ్చి గుద్దేయడం. విండ్ షీల్డ్ అద్దాలు ముక్కలు ముక్కలు గా పగిలి, గాల్లో నా ముఖం వైపు.. నా కళ్ళ వైపు వేగం రావడం... తల కి ఎదో గట్టి గా తగిలి, చుట్టూ రక్తం .. నేను స్పృహ తప్పి పడిపోవడం. ఇదంతా ఒక సెకను లో జరిగిపోయింది.

కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉన్నాను. టైం చూస్తే ఒంటిగంట. ఏమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఆక్సిడెంట్ అయినట్టు ఉంది.. ఆ నొప్పి ఇంకా తెలుస్తూనే ఉంది. కానీ నేను మాత్రం ఇంట్లో బెడ్ మీద ఉన్నాను. గబగబా వెళ్లి కిటికీ లోంచి ఇంటి బయట పార్కింగ్ స్పేస్ లో చూశాను. కార్ సేఫ్ గా అక్కడే ఉంది. ఇదంతా ఓ కల లా ఉంది. కాని నిజంగా జరిగినట్టు ఉంది.

సరిత ఇంకా ఇంటికి రాలేదు. ఏమైందో కాల్ చేద్దాం అని ఫోన్ తీస్కున్నా. "ఫ్రెండ్స్ అంత కలిసి ఇక్కడే స్టే చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తా." అని మెసేజ్ తన దగ్గరి నుంచి. సరే ఇంక ఈ టైం లో కాల్  చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చేయలేదు. ఇంతవరకు మెదడు లో ఏవేవో ఆలోచనలతో గమనించలేదు కాని ఇంట్లో ఎదో తెలీని నిశబ్ధం. ఫ్యాన్ సౌండ్ కూడా వినబట్లేదు. మరణ నిశబ్ధం. అతి భయంకరమైన నిశబ్ధం.

కొన్ని వాటర్ తాగి నిద్ర కంటిన్యూ చేద్దాం అని కిచెన్ లో కి వెళ్ళాను. అప్పుడు వినబడిందా శబ్దం. అద్దం చీలుతున్నట్టు గా.. మెల్లగా ఎవరో అద్దాన్ని గోకుతున్నట్టు గా.. వినబడుతోంది. ఆ శబ్దానికి క్షణకాలం వెన్నులో భయం కరెంటులా ప్రవహించింది. ఆ శబ్దం, అచ్చు కలలో ఆక్సిడెంట్ అయిన క్షణం లో కార్ విండ్ షీల్డ్ చీలుతున్న శబ్దంలా అనిపించింది. బహుశా ఆ కల ప్రభావం కావచ్చు. అందుకే ఏవేవో ఆలోచనలు బుర్ర లోకి వస్తున్నాయ్. బెడ్ రూమ్ కి వెళ్లి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను.

టక్.. టక్.. టక్.. టక్.. టక్.. టక్.. అని ఎదో శబ్దం తో నిద్ర లేచాను. ఎక్కడో ఈ రూమ్ లోంచే వస్తోంది. టైం ఎంతయిందో తెలీదు. లైట్స్ ఆఫ్ లో ఉండడం వల్ల సరిగా కనబడటం లేదు. టక్.. టక్.. టక్..మల్లీ అదే సౌండ్. పడుకొనే, రూమ్ మొత్తం చూస్తున్నాను. ఎక్కడనుంచి ఆ శబ్దం వస్తోందా అని. అద్దం ముందు ఏదో కదిలినట్టు అయ్యింది. కిటికీ లోంచి వస్తున్నా వెన్నెల కాంతి లో కళ్ళు మరింత ఫోకస్ చేసి చూశాను. ఎదో నల్లటి ఆకారం.. కాదు.. నీడ లాంటి ఆకారం.. అద్దం ముందు నిలబడినట్టుగా ఉంది. భయం తో ఒళ్ళు కంపించింది. తీక్షణంగా చూశాను.. అద్దం ముందు కాదు. అద్దం లో.. ఎదో నీడ లాంటి ఆకారం. మనిషి నీడ లాంటి ఆకారం. కదలిక లేకుండా.. నిటారు గా. నన్నే చూస్తున్నట్టు అనిపించింది. నా కాళ్ళు.. చేతులు.. ఎవరో గట్టిగా పట్టేసినట్టు.. జీవం లేనట్టు.. కదిలిచడానికి కుదరట్లేదు. గొంతు లోంచి శబ్దం రావట్లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ వేగానికి ఛాతిలో నొప్పి తెలుస్తోంది. ఇందాకటి కలలో కార్ హెడ్ లైట్స్ చెట్ల మీద పడి వాటి నీడ, దెయ్యం చేతులు ఊపుతునట్టు అనిపించినట్టు  అద్దం లో ఆకారం కూడా మెల్లగా నీడా లా కదుల్తోంది. ధైర్యం కూడగట్టుకొని మెల్లిగా లేచాను.. అద్దం లో ఆకారం వెనక్కి వెళ్లినట్టు అనిపించింది. ఇంకాస్త ముందుకి వెళ్ళాను. ఆ ఆకారం ఇంకాస్త వెనక్కు వెళ్ళింది. మెల్లగా అద్దం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఎవరు కనబడలేదు. తీక్షణం గా చుశాను. ఎంత వెదికిన ఎవరు కనడలేదు. ఏది కదిలినట్టు అనిపించలేదు. అద్దం పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాను. కానీ.. కానీ.. అద్దం లో.. నేను కూడా కనిపించడం లేదు.

*****************

ట్రింగ్............. ట్రింగ్................ పోద్దున్నే కాలింగ్ బెల్ మోగడం తో నిద్రలేచింది సరిత. టైం చూద్దాం అని ఫోన్ తీస్తే, ఫోన్ స్విచ్ ఆఫ్. నైట్ పార్టీ నుంచి వచ్చాక ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినందుకు తనను తానూ తిట్టుకుంటూనే వెళ్లి డోర్ తీసింది. ఎదురుగా ఎవరో పోలీస్. ఆయన చేతిలో తన భర్త సెల్ ఫోన్. నైట్ ఆఫీసు కి వెళ్ళిన తన భర్త సెల్ ఫోన్ ఈయన దగ్గర ఎందుకు ఉందో సరిత కి అర్థం కాలేదు. పోలీస్ ఆఫీసర్ సరిత కి ఎదో చెప్తూ ఉన్నాడు. యాదృచ్ఛికంగా ఇంటి బయట ఖాలీగా ఉన్న పార్కింగ్ స్పేస్ వైపు చూస్తూ ఏమైందో తెలియని కంగారుతో జాగ్రత్తగా వింటోంది సరిత.

- శ్రీ

Comments

  1. Nice post .very interesting ! Visit our website for more news updates TrendingAndhra

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones

సీతాకోకచిలుక