వానర్ బాబా - ఓ కోతి కథ!

"వానర్ కుమార్ ఆన్ డ్యూటీ సర్.. సిటీ లో ఉన్న ముప్పై మంది క్రిమినల్స్ మటాష్ సర్. వాళ్ళ దగ్గర పని చేసే చెంచాలు అందరు బెహైండ్ ది బార్స్ ఉన్న్నారు సర్" గొంతు చించుకున్నాడు అప్పుడే కొత్త గా SI డ్యూటీ లో జాయిన్ అయిన వానర్ కుమార్. అదంతా చెవులు మూస్కొని జాగ్రత్త గా వింటున్న DSP వానరేష్, బెహైండ్ ది బార్స్ అనగానే అలెర్ట్ అయిపోయి, పోలీస్ స్టేషన్ లో ఉన్న కోతులన్నీ..అదే పోలీస్ లందరూ, బార్ కి వెళ్లి బీర్ బ్రేక్ తీస్కోవాలని అని ఆర్డర్ పాస్ చేసాడు. కానీ టైం ఇంకా ఎర్లీ మార్నింగ్ పదే అని పక్కనే ఉన్న కానిస్టేబుల్ కోతి బాబు గుర్తు చేయడం తో.. కాస్త నెమ్మదించి, బీర్ బ్రేక్ ని కాస్త కాఫీ బ్రేక్ గా సవరించి కొత్త ఆర్డర్ పాస్ చేసాడు. ఇంత కష్టపడ్డ, తన ప్రతిభ ని DSP గుర్తించకపోవడం తో.. బాధ తో కాఫీ తాగడం కన్నా బీర్ తాగితే తన బాధ కొంచెం తగ్గుతుందని అలోచిస్తున్న వానర్ కుమార్ థాట్స్ కి వానరేష్ లాంగ్ జంప్ చేసి అడ్డొచ్చి.. "ఇంత కష్టపడి.. ఆ చెట్టు, ఈ చెట్టు ఎక్కి..దూకి..పాకి.. క్రిమనల్స్ ని నెల నాకించినందుకు గాను.. నీకు కంగ్రాట్స్." అని ఆవేశం గా ఒక డైలాగ్ విసిరి, ఆయాసం గా క్కుర్చి లో కూలబడ్డాడు.

కొన్ని నెలల తర్వాత తాను చేసిన కోతి చేష్టలు (సాహసాలు) లకు గాను, స్వాతంత్ర దినోత్సవం నాడు.. వానర రత్న, వానర వీర, వానర సూర లాంటి ఇంకో పది అవార్డ్స్ వానర్ కుమార్ లాక్కున్నాడు. అదే.. అందుకున్నాడు. ఈ సాహసాలు చూసి, పరమ మంచి డైలాగ్ చెప్పినందుకు గాను, వాస్కర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైలాగ్ 2018 ని DSP వానరేష్ కొనుక్కున్నాడు.సారీ.. అందుకున్నాడు.

ఆ గట్టు నుంటావా.. కోతెన్న ఈ గట్టు కొస్తావా...హేయ్... ఆ చెట్టునుంటావా.. కోతెన్న.. ఈ చెట్టు కొస్తావా.. హేయ్య్.. అని అలారమ్ మోగడం తో.. మంచి కల నుంచి లేచాడు వానర్ కుమార్. ఎప్పటికైనా SI అవ్వాలనేదే వానర్ కుమార్ కల. అందుకే రోజు తను SI అయినట్టు.. పెద్ద పెద్ద అవార్డ్స్ లాక్కునట్టు.. కలలు కంటూ ఉంటాడు. కాని రెండు టైర్లు తన పొట్ట చుట్టూ ఉండడం తో.. సెలక్షన్ రౌండ్ లో నే.. విఫలం అవ్తున్నాడు. అందుకే.. ఎలాగైనా తన రెండు టైర్లు కరిగించి.. సిక్స్ ప్యాక్ తెచ్చుకొని.. ఫిట్ అవ్వాలని.. చాలా ఆవేశం గా.. అనుకుంటూ ఉంటాడు. పోద్దున్నే మాత్రం తీరిగ్గా లేచి అలవాటు ప్రకారం పళ్ళు తోమకుండా.. డైరెక్ట్ గా టిఫిన్ ని లాగిచేసేస్తుంటాడు. మన వానర్ కుమార్ ఫుడ్ మెనూ చూస్తే.. ఎలాంటి కోతికైన నోరు, ముక్కు, కళ్ళు, చెవులు ఊరాల్సిందే. పొద్దున్నే, అరటికాయల ఉప్మా (ఏమో.. కోతులు అరటికాయలతో ఉప్మా చేసుకుంటాయేమో.. నీకెలా తెల్సు అని నన్ను అడక్కండి.) తర్వాత అరటికాయల జ్యూస్ విత్ హనీ. మధ్యాహ్నం, అరటికాయ బిర్యానీ విత్ ఎక్స్ట్రా అరటికాయ పీసెస్. సాయంత్రం అరటికాయ 65, అరటికాయ చిప్స్, ఇవి బోర్ కొట్టినప్పుడు అరటికాయ ఫింగర్స్. మన వానర్ కుమార్ బాగా హెల్త్ కాన్సియస్ కాబట్టి, టీం టైం లో ఒక కప్పు గ్రీన్ టీ మేడ్ విత్ ఫ్రెష్ అరిటాకులు. ఇంకా డిన్నర్ హెవీ ఫుడ్ తినకూడదు కాబట్టి లైట్ గా జస్ట్ ఓ రెండు అరటి గెలలు. ఇవన్ని తిన్నాక తన పొట్ట కూడా అలా అరటిగెలలా తయారయ్యింది. దాన్ని మోసి మోసి, తను అరటికాయలా ఒంగిపోయాడు.

ఇంట్లో అరటికాయలు అయిపోయిన వీక్ మూమెంట్ లో ఎలాగైనా సరే పొట్ట తగ్గించాలి అనే భయంకరమైన నిర్ణయానికి వచ్చాడు వానర్ కుమార్. గుడి దగ్గర భక్తులు లోపలకి వెళ్తూ తమ షూస్ ని, బయట వెయిట్ చేస్తున మన వానర్ కుమార్ కి డైరెక్ట్ గా ఇవ్వడానికి భయపడి, పక్క్కనే విడిచి వెళ్ళినప్పుడు.. వాళ్ళ పరిస్థితిని అర్థం చేస్కుని.. తనే వెళ్లి తీస్కున్న (తీసేస్కున్న) షూస్ వేస్కొని.. , ఈవెనింగ్ జంప్ కి భయల్దేరాడు. భారంగా రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ లో నుంచి ఇంకో ట్రైన్ మీదకి లాంగ్ జంప్ చేస్తున్న సమయం లో, ట్రైన్ మీద వయ్యారం గా నడుస్తూ అరటికాయలు లేని కరువు రాజ్యానికి కోతి రాణి లా, అరటికాయలు పీకేసి ఎండిపోయిన అరటి గెలలా.. వస్తూ కనిపించింది వనరా బాదుకొనే. తన అందాన్ని చూసి, కాలు స్లిప్ అయ్యి.. ట్రైన్ మీద కి జంప్ చేయాల్సిన తను..స్ట్రెయిట్ గ ట్రైన్ డోర్ గుండా ట్రైన్ లో కి జంప్ అయ్యాడు. కరెక్ట్ గా డోర్ దగ్గర కూర్చున్నఒక ముసలి పూజారి సంచి లో పడ్డాడు. సంచి లో ఉన్న కుంకుమ పొట్లం కాస్త పగిలి..ముఖానికి, తోక కి కుంకుమ అంటుకుంది. అదే టైం కి ట్రైన్ స్టార్ట్ అయింది. ఎలాగైనా సరే వనరా బాదుకొనే తో మాటలు (తోకలు) కలపాలని, కష్టపడి..సంచి లోంచి బయటికి వచ్చాడు... కాని అప్పటికే ట్రైన్ చాల దూరం వెళ్ళిపోయింది. ఎక్కడో దూరం గా ఉన్నపచ్చటి అరటిపండు లా కన్పిస్తోంది వనరా బాదుకొనే. ఎంతో ఆత్రం తో తినడానికి తోలు వొలుచుకున్న అరటికాయ కింద పడిపోయినట్టు అన్పించింది వానర్ కుమార్ కి. అందని అరటికాయ చప్పన అని మనసుని కాస్త కంట్రోల్ చేస్కుని, ట్రైన్ లో ఎవరైనా ఏదైనా ఇస్తే తీస్కుందాం (ఇవ్వకపోతే లాక్కుందాం) అని లోపలికి వెళ్ళాడు. ఏమైందో ఏమో తెలిదు కాని.. ట్రైన్ లో అందరు లేచి నుంచుని దండం పెడ్తున్నారు. కొంతమంది అరటిపళ్ళు తేచి ఇస్తున్నారు. ఒక పెద్దాయన నడుము కి ఎదో సంచి కట్టాడు. అలానే మెళ్ళో ఒక తాడు కట్టాడు. అందరు వచ్చి.. ఆ సంచి లో ఏవేవో చిత్తు కాగితాలు... గుండ్రటి బిళ్ళలు.. అరటికాయలు వేశారు.

నాకు తాడు కట్టిన పెద్దాయన చాల మంచాయన లా ఉన్నాడు. ఆ పనికిమాలిన చిత్తు కాగితాలు, బిళ్ళలు తానూ తీస్కోని.. నాక్కావాల్సిన అరటికాయలు మాత్రం నాకిచ్చాడు. గొప్పోడు. తర్వాత నన్ను తీస్కెళ్ళి డోర్ దగ్గర ఓ పెద్ద స్టూల్ వేసి దాని మీద కూర్చోబెట్టాడు. ఎక్కి దిగే వాళ్ళందరూ దండలు వేస్తూ.. దండాలు పెడ్తూ వెళ్తున్నారు. పక్కనే అద్దం లో ఎవరో కొత్త కోతి కనిపించేసరికి గుర్ ర్.. అన్నాను. వాడు కూడా గుర్ ర్.. అన్నాడు. అప్పుడు అర్థం అయింది. అది వానర్ కుమార్ యే అని.. అదే అండి.. నేనే అని. మొహం అంత కుంకుమ ఉండడం తో అలా కన్ఫుస్ అయ్యా. అలా అయ్యినదుకు లోల్ అని నవ్వుకొని.. SI అవ్వకుండానే.. ఇన్ని దండలు.. దండాలు.. రెస్పెక్ట్ సంపాదించిన సంధర్బం గా.. లోలోపలే సంతోషపడ్తుంటే.. పక్కనే ఉన్న పెద్దాయన "వానర్ బాబా కి జై.. వానర్ బాబా కి జయ్.." అన్నాడు. ఏంటో అబ్బా..వీళ్ళ అభిమానం తగలెయ్య.. మరీ మోసేస్తున్నారు. నాకు ముందే పొగడ్తలు నచ్చావ్... ఒక్క అరటికాయలు తప్ప.

- శ్రీ
 

Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones