బ్లాగు మొదలు పెట్టాను , సరే .... ఏమి రాయాలి ?

అది తెలియనపుడు బ్లాగు పెటడం దేనికి అట ! అని మీరు నను తిట్టుకోవచ్చు , ఏమి రాయావదు  మేము కూడా ఏమి చదవం అని తప్పించుకోవచ్చు  లేదా  ఎదో ఒకటి రాయరా బాబు తీరిక ఉంటె చదువుతాం అని విసిగుంచుకోవచ్చు .....
సరే సరే    మీకే ఇన్ని ఆలోచనలు  వచినప్పుడు నాకు కూడా ఎదో ఒక ఐడియా రాకపోతుందా అనుకున్నా .... నన్నేం చేయమంటారు , పరిస్థితి ఇలా తగలడుతుందని నేనేమన్నా అనుకున్నానా . ఐనా సరేలే ఎదో ఒకటి రాద్దామని ఇలా వచ్చా ... :)
మొదట sports గురించి రాద్దామని అనుకున్నా , చదవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా రాయడానికి నాకు sports గురుంచి బొత్తిగా ఎమీ తెలియదాయె . సరే politics , అందులో కూడా నేను సున్నానే  (మరీ పెద్ద సున్నా కాదులెండి ).మరి ఎ విషయమైతే  మీకు, నాకు సరిపోయేలా ఉంటుంది మీరే కాస్త చెప్పండి . మీరు కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేరు కనుక నేనే ఆలోచిస్తాలెండి . పోనీ సినిమాలు గురించి రాస్తే , వద్దు వద్దు ,అది తలనొప్పి బాబోయ్ .
 ఈ confusion లోంచి బయటికి రావడానికి time పడ్తుంది కానీ , ప్రస్తుతానికి ఎలా రాస్తే బావుంటుందో ఆలోచిదాం . మీరేమంటారు ? ( మీరు ఏమన్నా నేను దీని గురించే ఆలోచిస్తా )

ఎలా ?
 ఎలా?

అందరికీ నచ్చేలా , అందరూ మెచ్చేలా , సకుంటుంబ సపరివారంగా చదివేలా ....ఇలా  ఇలా ......... రాద్దామనుకున్నా , నేను రాయలేనని నాకు తెలుసు (త్వరలో మీకు కూడా తెలుస్తుంది లే   ...  :P )  కాబట్టి  కొంత మందైనా మెచ్చుకునేలా రాద్దామని అనుకుంటునా .నేను ఎలా రాసిన మాకు నచ్చదు అంటారా .. ? మీకు కాకపోతే ఇంకొకరికి ...!!!
ఈ విషయం కూడా ఇప్పట్లో తెగేలా లేదు . త్వరలో ఎదో ఒకటి తెల్చేస్తాను లెండి. ప్రస్తుతానికి బ్రతికిపొండి .

Comments

  1. బ్లాగ్లోకానికి స్వాగతం మీకు.

    ReplyDelete
    Replies
    1. నన్ను స్వాగతించినందుకు ధన్యవాదాలు మీకు .... :)

      Delete
  2. మనకని ప్రత్యకమైనవి రాసినప్పుడు మాత్రమె మనకు మొదటి స్తానం దొరుకుతుంది
    మీ లాంటి తర్జన భర్జన లొనే నేను వున్నాను

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక