అవును, నేను బయలుదేరాను...

అవును ,నేను  బయలుదేరాను ...
అదిగో ,అక్కడ దగ్గరగా కనిపిస్తున్నాయే ...
ఆ సుదూరలకు .
ఎందుకో ...
ఎక్కడా ఆగలనిపించట్లలేదు .
నేనేమి ఒంటరిని కాను .
నాతో పాటే చాలా వస్తున్నాయ్.
ఆనందంతో తుళ్ళిపడే ఆ లేగదూడ ...
పొద్దస్తమానం దిక్కులు తిరిగే ఆ ప్రొద్దుతిరుగుడు...
అలుపెరగని ఆ తేనెటీగ ...
ఎప్పడూ దారి తప్పని ఆ చిన్ని చీమ ...
ఇంకా చాలానే...
ఇంతలో ...
లేగదూడ కూలిపోయింది .
ఎంత వెతికినా తన తల్లి దొరకదని తెలిసిపోయినట్టుంది .
ప్రొద్దుతిరుగుడు తల వాల్చేసింది .
ఎంత దూరం వెళ్ళినా , ఇక తెల్లారదని గ్రహించినట్టుంది .
తేనెటీగ పూవు మీద వాలిపోయింది.
తన తేనెపట్టు దారి , తప్పినట్టుంది .
చిన్ని చీమ అలసి సొలసి ఆగిపోయింది .
ఎంత వెతికినా తన గూడు అగుపించనట్టుంది .
నేనింకా నడుస్తూనే ఉన్నా.....
మరింత దగ్గరైన ఆ సుదూరాలకు ...
ఇంకా ఆగలనిపించట్లేదు.
అవును, నేను బయలుదేరాను...

(శశి గారి ప్రోత్సాహం తో .... నాకున్నపాటి జ్ఞానం తో , ఎదో  కవిత రాశాననిపించాను...:P
ఎక్కడైనా తేడా గా ఉంటే , కాస్త క్షమించి , మిగతా కాస్త comments లో కక్కండి.)


Comments

  1. మీ భావుకత్వం మీ అక్షరాల్లో తెలుస్తుంది. కానీ కవితలా కనిపించలేదు.. alignments ఇంక బాగా చేసుండాల్సిందేమో..మరోలా భావించకండి.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయం తెలిపినందుకు thanks, chinni గారు.
      నాకు సాధారణ రచనాప్రపంచం తో అంతోఇంతో పరిచయం ఉంది కానీ, కవితాలోకం తో పెద్దగా లేదు . పరిచయం పెంచుకోడానికి ప్రయత్నిస్తాను . ... :) :)

      Delete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక