నీ కోసం... నీ ప్రేమ కోసం....

నే ఎదురుచూస్తున్నా....
 చూస్తూనేఉన్నా ...
నువ్ మాత్రం నను మరచిపోయావ్, మరలిపోయావ్.
ఏ క్షణమైనా కరుణిస్తావనుకున్నా...
నువ్ లేకపోతే అంతా శూన్యం .
ఒక్క క్షణం కూడా,నిను మరచినది లేదు.నీకోసం తపించనిది లేదు.
ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం మనం .
నవ్వుల ముత్యాలు,  చూపుల బాణాలు ...
 స్పర్శ లో పులకింత ,  నిద్దుట్లో కలవరింత...
ఎన్ని ఊసులు చెప్పుకున్నాం , ఎన్ని రహస్యాలు విప్పుకున్నాం .
కొమ్మ మీద పక్షి జంటని చూసి ఒకే గూటి పక్షులని నవ్వుకున్నాం.
గాలి చల్లగా వీస్తే మనకోసమే అని మురిసిపోయాం.
వర్షం మనల్ని పలకరించడానికే వస్తోందనుకున్నాం .
ఎన్ని తీపిగురుతులని చెప్పను.
ఎలా మరచిపోయావ్ ?
నా ప్రేమసామ్రాజ్యం లో తిరిగి ఎప్పడు ఉదయిస్తావ్ ...
నెలలా...సంవత్సరాలా...
నే ఎదురుచూస్తూనే ఉంటా....
నీ కోసం.

------------------------------------------------------------     

                      

Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక