'క్కా'కి గోల..!

నిన్న సాయంత్రం మా పక్క వీధిలో కుక్కలు వెంటపడితే నా పిక్కబలం చూపించి, దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ, కంగారులో మా పక్కింట్లో దూరాను.. అక్కడ నాకీ మాటలు వినిపించాయ్.

“ఒరేయ్ బక్కచిక్కిన తిక్కబావానేనిక్కడ పిలుస్తుంటే అలా చెక్కల చాటునా, పక్కల మాటునా దాక్కుంటావేట్రానీ దిక్కుమాలిన చుక్కలు లెక్కపెట్టే పనిని పక్కన పెట్టి ఒక్క నిముషం ఇక్కడకువస్తే చక్కని ముక్క ఒకటి నీ చెవిన వేస్తాఎక్కడెక్కడ వెతికినా, నీ తిక్కను చూసి ఒక్కరంటే ఒక్కరు… ఏమిటి అర్థమైందా?  ఒక్కరు కూడా మా అక్క అవడానికి ఒప్పుకోలేదురా. చివరికి పెక్కు నక్కజిత్తులు వేసి, కుక్కలపాలెం నుండి బహుటక్కులమారి అయిన, జక్కన చెక్కిన బొమ్మవలె మిక్కిలి అందమున్న ఒక చక్కని చుక్కను   తెచ్చానుఇక ఎన్ని ఇక్కట్లు వచ్చినా, పక్కవీధిలోని... ఒరేయ్వింటున్నావా? పక్కవీధిలోని 'హుక్కా తాగే   దుక్కలాంటి బుక్కన్న’గారి చెక్కల భవంతిలోనే నీ పెళ్లి చేస్తానని  తక్కెడ తాతారావ్ చొక్కా చింపి మరీ శపథం చేస్తున్నాడుఏమిటలా దిక్కులు చూస్తూ నిలుచున్నావ్వెళ్లువెళ్లి ఒక్కగ్లాసుడు చిక్కని పెరుగులో చెక్కెర కలుపుకొని తీసుకురా!చక్కగా తిని అలా చక్కర్లు కొట్టొస్తా”.

- బాలు

Comments

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!

సీతాకోకచిలుక