రాజాధిరాజావప్పా...పిచ్చెట్టా పట్టిందబ్బా...!!

అనగనగా ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన పిచ్చి మహారాజు ఒకడుండేవాడు. ఆయన చేసేవన్నీ మహా పిచ్చి పనులే. ఎందుకు ఎలా అని నన్ను అడగద్దు. నాక్కూడా చెప్పలేదు. నాకే కాదు, ఎవ్వరికి చెప్పలేదు. చెప్పడు కూడా. ఎందుకంటే ఆ పెద్దాయనకి పిచ్చి. చెప్పా కదా, మహా పిచ్చి. పిచ్చి పీక్స్.అస్సలు ఏమన్నా చెప్తేనేకదా, ఎవరికైనా తెలిసేది. ఆయనకి ఎందుకు పిచ్చి పట్టిందో తెల్సిన వాళ్ళందరూ ఇప్పుడు రాజ్యం లో లేరు. ఎప్పుడో బకెట్లు,పాత్రలు, కుండలు, చెంబులు వాళ్ళ ఇంట్లో ఏముంటే అవి తన్నేసి పోయారు. ఈ పిచ్చిమారాజు ఒక్కడే మిగిలాడు. చెప్పా గా, ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టాడు అని. ఈ పిచ్చిమారాజు అస్సలు రాజు ఎట్టా అయ్యాడు అని రాజ్యం లో అందరికి మహా డౌటు గా ఉండేది. కానీ ఎవ్వరికి అడగడానికి జేబులో గుండె ఉండేది కాదు. అడిగితే ఏ పిచ్చి శిక్షో వేస్తాడు అని. వెనుకటికి పిచ్చిపుల్కన్న అనే గొప్పవ్యక్తి ఇట్లానే ముందు వెనుక ఆలోచించకుండా రాజదర్బారు లో దూరి దొరగారి కాలరు దొరకబట్టుకొని ఏందిబే ని పిచ్చి దొరతనం అని దున్నేసాడంటా. దొరగారు మొదట జడుసుకొని, తరవాత తానే రాజు అని గుర్తు తెచ్చుకొని, ఏమంటివి ఏమంట...