బ్లాగర్ వాడే రచయితలకి ఉపయోగపడే చిన్న సలహా..

     బ్లాగ్లోకానికి నమస్తే, వీడేంటి మాకు సలహా ఇచేది అనుకోకుండా కాస్త చదవండి. ఈ సలహా blogger.com వాడుతున్న రచయితల కోసం. మనలో చాలా మంది కొన్ని సంవత్సరాలుగా బ్లాగ్గింగ్ చేస్తున్నారు. మొదట్లో బ్లాగులు రాసే వాళ్ళు, మరియు చదివే వాళ్ళు సిస్టం లేదా లాప్టాప్ వాడేవాళ్ళు. కాని ఇప్పుడు మాత్రం 40 నుంచి 60 శాతం, కొన్ని బ్లాగులకి అంతకంటే ఎక్కువ శాతం మొబైల్ విసిటర్స్ ఉన్నారు. ఈ విషయాన్ని మీ blogger dashboard లో stats లో ఉన్న audience tab లో చూడచ్చు. కాని వచ్చిన చిక్కల్లా, మనం వాడే బ్లాగు థీమ్స్ బాగా/కొంచెం పాతవి. ఈ థీమ్స్ మొబైల్ లో సపోర్ట్ చేసిన, నావిగేషన్ కష్టం గా ఉంటుంది. అందువల్ల మొబైల్ లో మన బ్లాగు చూసే వాళ్ళకి ఏదైనా old post చూడాలంటే, వరుసగా నెక్స్ట్ క్లిక్ చేస్తూ పోవాల్సివస్తుంది. ఇలాంటప్పుడు మన రీడర్ కి చదివే ఇంట్రెస్ట్ పోతుంది. Wordpress ఇలాంటి విషయాల్లో Blogger కంటే కొంచెం మెండే అయిన, చాలామంది రచయితలు, సులభం గా ఉండడం వల్ల Blogger నే ఎంచుకుంటారు. దీన్ని పరిష్కరించడానికి Blogger(Google) కొత్త థీమ్స్ ని ప్రవేశపెట్టింది. 

మీ blogger dashboard లోకి వెళ్ళాక , theme మీద క్లిక్ చేస్తే, నాలుగు రకాల కొత్త థీమ్స్ కనిపిస్తాయి - 
 


ఈ కొత్త థీమ్స్ లో మెరుగుపరచిన మొబైల్ లేఔట్ మరియు నావిగేషన్ ఏ కాకుండా, సిస్టం థీమ్ కూడా మరింత అందంగా, మెరుగ్గా ఉన్నాయి. వీటిని ట్రై చేసి, మీకు రుచి కి సరిపోయే థీమ్ సెట్ చేస్కొండి. ఈ విషయం లో ఏదైనా సందేహం ఉన్న, ఇంకేదైన (బ్లాగులకి సంబంధించి) అడగదలచుకున్న, కామెంట్ లో తెలపండి . లేదా kavvinta@gmail.com కి మెయిల్ చేయండి.

--- శ్రీ ---

Comments

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones