కృష్ణ గాడి వీర ఆఫీసు గాధ




      ఈ ప్రపంచం లో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటి అని నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం... పొదున్నే లేవడం. కావాలంటే పొద్దున ఆరు గంటల దాకా మేలుకుంటా గాని, పొద్దున్నే ఆరుకే లేవమంటే మాత్రం కుదరదు. బుద్దున్నవాడేవాడన్న అంత పొద్దున్నే లేస్తాడా చెప్పండి. నైట్ అంతా ఫేసుబుక్ లో దొర్లాలి..యూట్యూబ్ లో దేఖాలి( హిందీ లో చెప్పా)... వాట్సప్ లో దున్నాలి... ఇంతా కష్టపడి అర్ధరాత్రి దాక మేలుకుంటే, పొదున్నే లేచి ఆఫీసు కి పోవాలి. ఏం.. మా లాంటి పెళ్లి కాని కుర్రాలకి మధ్యాహ్నం నుంచి ఆఫీసు కు వచ్చే వెసులుబాటు ఇవ్వొచ్చు గా.

      సరే అని యాజ్ యూసువల్ గా, లేటుగా ఆఫీస్ కి వెళ్ళా... ఆఫీస్ గుమ్మం దగ్గర గుమ్మడికాయ (మా రెసెప్షనిస్టు) కిక్కికి.. అని వెకిలి గా నవ్వింది...అలా హాలులో నడుస్తూ వెళ్తుంటే కోలీగ్ వెటకారంగా, నా మీద యుద్ధం గెల్చినట్టు ఓ పిచ్చి చూపు, ఓ వెర్రి నవ్వు విసిరాడు.. ఈ వెర్రిమాలోకంతో ఏంటి లే అని నా డెస్క్ దగ్గర పోయా. "కం టు మై డెస్క్" ఇట్లు మీ పిచ్చిబాసు (పిచ్చి నేను యాడ్ చేశా) అని బంక నోటు ముక్క( స్టికీ నోట్స్) సిస్టం కి అంటించి ఉంది. తొక్కలో వాడు పిలిస్తే నేనేంటి పొయేది అని కుర్చీ లో కూలబడి, నిద్ర మొహం తో కష్టం గా కళ్లు తెరిచి పవర్ బటన్ ఎక్కడుందో కనుక్కుని సిస్టమ్ ఆన్ చేస్తే... టుయ్.. టుయ్ అని నోటిఫికేషన్..ఏంట్రా అని చూస్తే బాసు బాబు (బాసు వాళ్ళ బాబు కాదు. బాసే.. కాదు కాదు.. బాసు గాడే) దగ్గరనుంచి మెయిల్. ఏంట్రా పొద్దునే (మధ్యాహ్నం.. కానీ మనం లేచేది అప్పుడే కాబట్టి మనకు అది పొద్దున్న) వీడి యెదవ గోల అని మెయిల్ చూస్తే.. "కం టు మై డెస్క్ ఎ. ఎస్. ఏ. పి." సరే ఇంతగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఏంటో మేటరు అని వెళ్ళా.. చెత్త కుప్పలో పడేసిన చికెను ముక్క ఇంకో కుక్క బొక్క లోకి లాక్కుపోతే చిక్కిపోయిన పిచ్చి కుక్క లా గుర్రు గా చూస్తున్నాడు. వెళ్లి ఏంటమ్మా.. ఏంటి విషయం అని ఓ లుక్కిచాను. "టైం ఎంతో తెలుసా" అని మొరిగాడు. "ఎర్లీ మార్నింగ్ పన్నెండయ్యింది" అని చెప్పా. "సరే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తునందుకు చాలా థాంక్స్. త్వరగా నీ పని చూసుకొని ఎర్లీ గా పది కి వెళ్లిపో" అని ఆఫర్ ఇచ్చాడు. "సరే వెళ్ళొస్తా పది దాటి రెండు గంటలైపోయింది" అన్నా.." పొద్దున్న పది కాదు, రాత్రి పది" అని మళ్ళీ మొరిగాడు. సమరసింహరెడ్డి లో 'కుక్క మొరిగింది అనుకో' అనే డైలాగ్ గుర్తుతెచ్చుకొని, "ఎస్ బాస్" అని చెప్పి నా డెస్క్ దగ్గరికెళ్లి కూర్చున్న.

      ఏ యెదవైనా నాకు మెయిల్ పెట్టాడేమో అని చూస్తే.. చాలా మెయిల్స్ ఉన్నాయి.. చాలా మంది ఎదవలు ఆఫీసులో ఉన్నారని నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టీ.. ఒక్కో మెయిల్ చదువుతూ..నేను పని చేయాల్సిన వాటిని ఫ్లాగ్ చేస్తూ ఉన్నా. అలా మెయిల్ పెట్టగానే ఇలా పని చేసేయకూడదు... తీరిగ్గా ఆలోచించి (పని గురించి కాదు), లంచ్ బ్రేక్ తీస్కొని, కుదిరితే అలా ఓ పఫ్ కొట్టి (ఉచిత హెచ్చరిక : ప్రొగ తాగుట ఆరోగ్యానికి హానికరం), చిన్న పవర్ నాప్ (గంట సేపే.. పవర్ నాప్ ఎక్కువ సేపు తీసుకోకూడదు), లేచాక కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు సమోసాలు తిని, తీరిగ్గా పని చేయాలి. లేకపోతే తప్పులు జరిగే ప్రమాదం ఉంది, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఇలా కష్టపడి సాయంత్రం ఆరు దాకా పని చేయాలి. పని లేకపోయినా ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఇంకో గంటసేపు టైంపాస్ చేసి, బాసు గారు/డు ఉన్నాడా పోయాడా చెక్ చేస్కొవాలి. ఉంటే హెడ్సెట్ చెవిలో పెట్టుకొని క్లయింట్ మీటింగ్ లా బిల్డప్ ఇస్తూ అప్పుడప్పుడూ "యా.. యా.. ఐ అగ్రీ విత్ యు", "యెస్.. ఐ విల్ డు దట్" అని రెండు డైలాగులు చెప్పాలి. లేకపోతే మనం ఉత్తినే కూర్చున్నాం అన్న డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ బాసు లేకపోతే, త్వరగా కుర్చీ తన్నేసి పారిపోవాలి. ఎందుకున్టే, బాసు కచ్చితంగా అక్కడే ఎక్కడో ఉంటాడు. మళ్ళీ డెస్క్ దగ్గరికి వచ్చేస్తాడు.
మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఏ బాసు గాడు మనకంటే ముందు ఇంటికి వెల్లడు.

      సరే 'బతుకు జీవుడా..' అని ఎలాగోలా ఇంటికి పారిపోయి వచ్చా. ట్రింగు.. ట్రింగు.. అని బాసు గాడి నుంచి ఫోను. ఫోను లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఏం పని చెప్తాడో అని ఫోను పక్కన పడేసాను. మళ్ళీ కాల్ వచ్చే ప్రమాదం ఉందని సైలెంట్ లో పెట్టేసాను. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భాల్లో ఫోను స్విచ్ ఆఫ్ చేయకూడదు. చేస్తే మనం కావాలనే చేస్తున్నాం అని తెలిసిపోతుంది. కర్రా విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు హ్యాండిల్ చేయాలి. తరువాత రోజు అడిగితే ఫోన్ సైలెంట్ లో ఉందనో.. పక్కింటి పాప పట్టుకెళ్లిందనో.. ఏ నోటికోచిన్న సోల్లో చెప్పచ్చు. రూమ్ కొచ్చాక కాస్త ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం బయట
దో హోటల్ కెల్లా. మెనూ మొత్తం చదివి ఏదోఒక పిచ్చి ఐటమ్ పేరు చెప్తే.. వాడేదో ఇంకో పిచ్చి ఐటమ్ పట్టుకొచ్చాడు.. అదే మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ అని గుడ్డిగా నమ్మేసి.. కడుపు నిండా మెక్కేసి.. తర్వాత రూమ్ కొచ్చి బెడ్ మీద పడిపోయా. హమ్మయ్య.. ఇంక లాప్టాప్ లో యూట్యూబ్.. ఫోను లో ఫేస్బుక్. యూట్యూబ్ లో అప్పుడప్పుడు యాడ్స్... ఫోనులో అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజెస్. ఇంకొంచెంసేపు...ఇంకొంచెంసేపు.. అని అర్థరాత్రి రెండయిపోతుంది.

        ఇదంతా తెల్సికూడా పొదున్నే తొమ్మిదికే ఆఫీసుకి రమ్మంటారు. సరే జస్ట్ ఫర్ ఎ చేంజ్ అని ఒకరోజు కరెక్టుగా తొమ్మిదికే ఆఫీసుకు వెళ్ళా. మెయిల్ బాక్సు ఓపెన్ చేయగానే మా పెద బాసు (మా బాసు గాడికి బాసు గాడు) దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. ఏంట్రా ఈ పెద్ద మనిషి గోల అని చూస్తే "కం టు మై కేబిన్ ఎ. యెస్.ఏ. పి. ఫ్రొం, బంకమట్టి బలపాల్రావు." అని ఉంది. అలవాటు లేని పనులు ( కరెక్టుగా ఆఫీసుకి రావడం) చేస్తే ఇలాగే అనర్థాలు జరుగుతాయని నన్ను నేనే తిట్టుకుంటూ వెళ్ళా. కూర్చో మిస్టర్ కృష్ణ, నీకొక బాడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు. లేట్ గా వస్తునందుకు పీకేసే కార్యక్రమం కరెక్టుగా వచ్చిన రోజు పెట్టారనుకుంటా, మా బాసు గాడు గట్టిగా మన మీద కంప్లైంట్ చేసినట్టున్నాడు. ఆలోచిస్తూనే, "సరే, చెప్పండి పెద బాసు గారు" అన్నాను. "మీ బాసు రీసైన్ చేశారు మన కంపెనీ నుంచి" అని చెప్పాడు. ఇంత గుడ్ న్యూస్ ని అంత బాధ గా చెప్తాడేంటి ఈ పెద్దాయన. మన గోల తట్టుకోలేక పారిపోయినట్టున్నారు పాపం. పోతూ.. పోతూ.. మన గురించి కంప్లైంట్ చేసి పోలేదు కదా అనుకుంటూనే, "ఓహ్.. ఉయ్ అర్ గోయింగ్ టు మిస్ ఎ గుడ్ లీడర్ సర్. హోప్ అవర్ కంపెనీ ఫైండ్స్ అనొథెర్ గుడ్ లీడర్" అని అన్నా. "అవును, మీ టీం ని చూస్కోడానికి ఇంకో మంచి లీడర్ ని పరిచయం చేసి వెళ్ళాడు మీ బాసు. కంపెనీ లో ఐదు సంవత్సరాలుగా ఉంటూ.. టీం లో సీనియర్ మెంబెర్ అయిన నిన్ను టీం లీడర్ గా చేయాలని మానజ్మెంట్ డెసిషన్ తీసుకుంది. కంగ్రాట్స్" అని చెప్పాడు. 


--- శ్రీ ---

Comments

  1. ఇప్పుడు మీరు బాసు అయ్యారు కాబట్టి బాసు వెర్షన్ కథ వ్రాయండి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones