అమ్మ పెట్టిన చివాట్లు, తాత చెప్పిన మంత్రాలు!!




     సాయంత్రం అవ్వగానే ఆఖరి బెల్లు ఎప్పుడెప్పుడు కొడతారా అని వెయిట్ చేసేవాళ్ళం. ఐదవ తరగతి వాళ్ళకి చివరి క్లాసు జరగడం ఎప్పుడో ఒకసారి. టీచర్లు అంత మూడు, నాలుగు తరగతుల వాళ్ళకి పాఠాలు చెప్తుంటారు. సరే చివరి క్లాసు ఎలాగూ జరగదు కదా ఎగ్గొట్టి పొదాం అంటే స్కూల్ లీడర్ నేనె. కాబట్టి చివరి బెల్లు కొట్టాల్సింది నేనె. హెడ్ మాస్టర్ లేకపోతే బెల్లు బరువు బాధ్యతలు శివ గాడి కి ఇచ్ఛేవాడ్ని. బెల్లు హెడ్ మాస్టర్ రూమ్ లొనే ఉంటుంది. నేను కాకుండా ఎవరన్నా బెల్లు ముట్టుకుంటే, తరువాతి రోజు నాకు బెల్లు పగులుతుంది. ఇలానే నేను నా బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ స్కూలు లీడర్ పదవిని కార్తికు గాడికి కట్టబెడతారు. అప్పుడు నా పరువంతా ఏం కావాలి. స్కూల్ లో ఏదైనా ఫంక్షన్ జరిగినపుడు, చాక్లెట్లు పంచాల్సింది నేనే. మిగిలిపోయిన చాక్లెట్లు అన్ని నా స్కూల్ బ్యాగు లోకి వెళ్లిపోయేవి. ఎవరైనా పెద్ద గెస్ట్లు వస్తే, వాళ్ళిచ్ఛే నోటు పుస్తకాలన్ని పంచాల్సింది నేనె. మిగిలిన నోటు పుస్తకాలు మళ్ళీ నా బ్యాగు లోకే వెళ్ళేవి. స్కూల్లో ఎప్పుడైనా మ్యాజిక్ షో లు జరిగితే ముందు వరస లో కూర్చొని చూడచ్చు. ఇవన్నీ కార్తికు గాడికి అప్పనంగా కట్టబెట్టడం నాకు ఏ మాత్రము ఇష్టం లేదు. అందుకే హెడ్ మాస్టరు లేనప్పుడు మాత్రమే శివ గాడికి బెల్లు బాధ్యతలు అప్పగించి నేను గోడ దూకేస్తా. హెడ్ మాస్టరు ఉంటే మాత్రం, నేను రాముడు మంచి బాలుడు టైపు అన్నమాట.

     ఐదవగానే బెల్లు బయటకి మోసుకొచ్చి ధన ధనా అని ఆపకుండా ఒక నిమిషం కొట్టాలి. మళ్ళీ దాన్ని హెడ్మాస్టరు రూమ్లో పడేసి. బ్యాగు భుజానికి వేసుకొని ఇంటికి దౌడు. ఇంట్లో బ్యాగు పడేసి మళ్ళీ గడ్డివాము లోకి దౌడు. నాన్న అప్పుడప్పుడు కసురుకునే వాడు. ఇలా ఎప్పుడు చూసిన బ్యాగు పడేస్తే ఎప్పుడు బాగు పడతావురా అని. అది మన చెవులని తాకే సమయానికి మనం గడ్డివాములో ఉంటాం. ఆ మాటలు నా అంత స్పీడుగా గడ్డివాము దాకా రాలేక అక్కడే ఎక్కడో గాల్లో కలిసిపోయేవి. అవి అప్పుడప్పుడు అమ్మ చెవిలో పడేవి. వాటిని అమ్మ అలాగే గుర్తుపెట్టుకొని, తినడానికి ఇంటికి వచ్చాక అన్నం, కూర, మజ్జిగ, చివాట్లు కడుపునిండా పెట్టేది. భోజనం నోట్లోంచి కడుపులోకి వెళ్ళేది. చివాట్లు మాత్రం చెవిలోంచి బుర్రలోకి వెళ్లకుండా ఇంకో చెవిలోంచి బయటికి వెళ్లిపోయేవి. ఎంత చెప్పినా బుర్రకెక్కించుకోకపోవడం తో నాన్న చెవి కీ ఇచ్చేవాడు. అప్పుడు మాత్రం బుద్ధిగా బుర్రలోకి వెళ్ళేవి. అలా వెళ్లిన రెండురోజులు బుద్ధిమంతుడిలా అయిపోయేవాడ్ని. తర్వాత మళ్ళీ కథ కంచికి నేను గడ్డివాము కి.

     గడ్డివాము లో అస్సలు ఏముంది అంతగా అనుకుంటున్నారా. స్కూల్ గ్రౌండు తర్వాత నేను ఎక్కువగా ఆడుకొనేది ఇక్కడే. మా తాత, నాన్న కలిసి సీజన్ కి తగ్గట్టు పంటలు వేసేవాళ్ళు. పంట కోసుకొచ్చాక గడ్డివాము లో వరుసగా వాములు పేర్చేవాళ్ళు. వాటిమీద ఎక్కడం మహా సరదా. ఎక్కి గెంతుతుంటే అదో పిచ్చి ఆనందం. మనం ఎగురుతుంటే వాము మొత్తం ఊగిపొయేది. ఇక పైకెక్కి జుం...మ్ అని కిందకు జరుతుంటే ఎదో ఆకాశం లోంచి కిందకి దూకుతున్న ఫీలింగ్. అదే నాకు అడ్వెంచర్ పార్కు, వండర్లా, స్కై డైవింగ్.. అన్ని. కొద్దీ సేపట్లో శివ గాడు, కార్తికు కూడా వచ్చేసేవాళ్ళు. ఇంక దాగుడుమూతలు ఆడేటప్పుడు గడ్డివాము లోకి దూరిపోయేవాళ్ళం. వాము పాడుచేస్తున్నందుకు తాత కర్ర తీస్కొని నాలుగు తగిలించడానికి వచ్చేవాడు. మళ్ళీ వాము లోకి దూరిపోయేవాళ్ళం. ఎక్కడ దాక్కున్నామో కనుక్కోలేక వదిలేసేవాడు. అందరం వెళ్ళిపోయాక తిరిగి వాము సర్దేసేవాడు.

     ఇలా అడుకుంటుండగా ఒకసారి కాలికి ముళ్ళు గుచ్చుకుంది. మరీ చిన్న ముళ్ళు లా ఉంది. చేతికి దొరకెట్లేదు గాని మహా నొప్పి గా ఉంది. మా తాతకు మంత్రాలు వచ్చేవని ఎప్పుడు నాకు చెప్పేవాడు. నొప్పి లేకుండా మంత్రం వేయమని అడిగా. అస్సలు నొప్పే తెలీకుండా ముళ్ళు తీసేస్తా అని చెప్పాడు. సర్లే అని చెడ్డి పైకి లాక్కోని తాతగారి మంచం మీద కాలు పైకి పెట్టి కూర్చున్న. ఎదో అర్థం కాని భాష లో బీమ్ బూమ్ బామ్ అని చదువుతూ ముల్లున్న చోట చక్కిలి పెడ్తున్నాడు. ఏంటీ ఈ మంత్రాలు అస్సలు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తుంటే చటుక్కున ముళ్ళు లాగేసాడు. అపుడర్థమైంది, మంత్రం అంటే ఆయన చదివిన మాటలు కాదు, మనల్ని మభ్యపెట్టడం అని. తరువాత ఇవే మంత్రాలు నేను కూడా చాలా చోట్ల వాడేశా లెండి. నేనేంటి, మనందరం ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు మంత్రాలు వేసేవుంటాం. ఏమంటారు??!!


--- శ్రీ ---

Comments

  1. తీయని తెలుగు
    యువతకు
    మెరుగైన
    సేవలు
    చేస్తున్న ప్రతి ఒక్క రికి ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదం జ్ఞానిఖ గారు. మీకు నచ్చినందుకు సంతోషం. thank you for your comment :)

      Delete
  2. బాగున్నాయ్ శ్రీ గారూ, మీ చిన్నప్పటి గడ్డివామి విశేషాలు. మంత్రాల విషయం లో మీరన్నది అక్షరాలా నిజం.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అండి రెడ్డి గారు (ఇలా పిలిస్తే మీరేమి అనుకోరని భావిస్తున్నాను). మంత్రాలు అంటే నిజమే అన్ని నమ్మేవాళ్ళం చిన్నప్పుడు . ఇప్పుడు కూడా నిజమే అనుకోండి.కాని మనం అనుకున్న నిజం కాదు. వేరే నిజం.
      అప్పుడప్పుడు వచ్చి 'కవ్వింత' ని పలకరిస్తున్నందుకు చాలా థాంక్స్.

      Delete
    2. రెడ్డి గారు అనో, పవన్ అనో, ఒరేయ్ అనో పిలిచినా పర్లేదండి. మీ ఫ్రెండ్ నే అనుకోండి.

      Delete
    3. Sare bhayya. Reddy garu ani fix ayipondi. 😀

      Delete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones