పొట్టి బుడంకాయ్!

 
 




దానికిఅప్పుడు మూడేళ్ళు ఉండేవనుకుంట. మా పెద్దమ్మ కూతురు. చిన్ని అని పిలిచే వాళ్ళం మేమంతా. నేను మాత్రం పొట్టి బుడంకాయ్ అనేవాణ్ణి. మహా పెంకి పిల్ల.
ముళ్ళపూడి గారి 'బుడుగు' లేడీ వెర్షన్. అందుకనే ఆ పేరు పెట్టా. అదిగాని నోరు తెరిచిందంటే మేమంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే.

తెలుగు లో రైమ్స్ నేర్చుకుంది కొత్తగా. ఉంటాయి గా, చిన్నపిల్లల రైమ్స్ ఏవో. చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టింద, ఛుక్ ఛుక్ రైలు వస్తోంది... అవీ ఇవీ. ఇంటికి ఎవరొచ్చినా పాపం బుడ్డది ఇవన్ని చెప్పాల్సిందే. చెప్పేదాకా మా పెద్దమ్మ వదిలేది కాదు. అప్పుడప్పుడు రూపాయి బిళ్ళ లంచం ఇవ్వాల్సోచ్చేది. లేకపోతె వాళ్ళమ మొట్టికాయ ఒకటిచ్చేది. ఏది ఏమైనా వచ్చిన వాళ్ళకి రైమ్స్ వినిపించాల్సిందే.

ప్లే స్కూల్ లో ఆడుకుంటూ చెమ్మ చెక్క చేరాడేసి మొగ్గ పాటని నేర్చుకుంది కొత్తగా. దానికి ఆ పాట బాగా నచినట్టుంది. ఎవరు కనిపించినా..అడిగినా అడక్కపోయినా...చేప్పేసేది.
భలే ముద్దు గా చెప్తోంది కదా.. ఏది నాకు చెప్పమ్మా అన్నాను.

చెమ్మా చెక్కా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...
చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా...

ఇలా ఊ పది సార్లు తిప్పి తిప్పి కొట్టింది. ఇంకా పూర్తి గా నేర్చుకున్నట్టులేదు అని, "ఎప్పుడు చెమ్మ చెక్క యేనా, వేరేది చెప్పు" అన్నాను.

వెంటనే -

వేరే చెక్కా... చేరడేసి మొగ్గా...
వేరే చెక్కా... చేరడేసి మొగ్గా...
వేరే చెక్కా... చేరడేసి మొగ్గా...
వేరే చెక్కా... చేరడేసి మొగ్గా...

ఇలా చెప్పింది. అక్కడున్న నాకు, మా నాన్నకు నవ్వాగలేదు.

ఇలానే ఇంకోసారి అనుకుంటా. తెలుసు గా, చిన్న పిల్లలని మనం అడిగే ప్రశ్నలు, అమ్మ పేరేంటి, నాన్న పేరేంటి, అమ్మ ఎం చేస్తుంది, నాన్న ఎం చేస్తాడు, నువ్వేం చేస్తావ్, బువ్వ తిన్నావా, లాల తాగవా అని.
ఈ క్రమం లో ఒకసారి "మీ నాన్న ఎం చేస్తాడు చిన్ని" అని అడిగా. "దాడీ (డాడీ ని ఇలా పలికేది) ఆటో నడుపుతాడు. ఏంటో మా దాడీ, ఇంకా ఆటో నే నడుపుతున్నాడు" అని హాస్చర్యపడేస్తూ చెప్పింది. "సరే మరి, నువ్వేం చేస్తావ్ పెద్దయ్యకా?" అని అడిగా. "నేను దాడీ లాగా ఆటో నడపను. పే...ద్ద.. లారీ నడుపుతా " అని చెప్పింది. అక్కడున్న మేమంతా, ఇంకా ఈ పిల్లేదో డాక్టరు, కల్లెక్టరు లాగా ఏదైనా చెప్తుందేమో అని ఎదురుచూసాం. హాస్చర్యపడడం మా వంతయ్యింది.

ఒకసారి మా బుడంకాయ్ కి జలుబు చేస్తే, డాక్టరు దగ్గరికి పట్టుకెల్లిందట మా పెద్దమ్మ. అక్కడ టేబుల్ మీద ఇంకో పేషంటు కోసం పెట్టిన ఎర్ర రంగు గుండు మాత్రలు చూసి, పెప్పెరమెంట్ బిల్లలనుకొని, దాని బుడ్డి చేతిలోకి దొరికిన అయిదారు బిళ్ళలు వెంటనే నోట్లోవేసేసుకుందిట. ఆ చేదు భరించలేక, డాక్టరు గారి టేబుల్ మీద, వేసుకున్న కోటు మీద.. ఆ పక్క ఈ పక్క.. ఇష్టం వచ్చినట్టు ఊసేసిందంట. పాపం, ఇంటికెల్లాక వీపు మీద గాట్టిగా ఒక్కట్టిచ్చిన్దంట పెద్దమ్మ. అప్పట్నుంచి, మాత్రలు అన్న, పెప్పరమెంటు బిల్లలన్నా భలే భయం దానికి.

అది ఎమన్నా అన్నప్పుడు అందరు నవ్వితే గుర్రుగా చూస్తుంది. అందరం సైలెంటు గా మా పనుల్లో బిజీ గా ఉంటె వచ్చి అదెందుకు చేస్తున్నావ్, ఇదెందుకు చేస్తున్నావ్ అని బోలెడు ప్రశ్నలు వేస్తుంది. ఒకసారి అమ్మ కూరలోకి ఉల్లిపాయలు కోస్తుంటే పక్కకెళ్ళి కూర్చుంది. అమ్మేమో "వెళ్ళు చిన్ని, కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇక్కడ ఉంటె" అని చెప్పింది. "నేనేం ఏడవను.. ఇక్కడే ఉంటా.. ఇక్కడే ఉంటా..." అని అమ్మ చీర పట్టుక్కొని కూర్చుంది. నేను వెళ్లి లాక్కొచ్చి నా పక్కన కుర్చోపెట్టుకున్న. ఎప్పుడు వెళ్లిందో తెలిదు. వెళ్లి, కోసిన ఉల్లిపాయల ముక్కలన్నీ నేలమీద వేసి "బుమ్..బుమ్ .." అని వాటి తో బస్సాట అడుకుటోంది. అమ్మేమో వేరే రూమ్ లోకి వేల్లినట్టుంది. నేను వెళ్లి చూసే సరికి పాపం కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. "అయ్యయూ.. ఏమైంది చిన్ని" అని బుజ్జగించే సరికి నిజంగానే ఏడ్చేసింది. తర్వాత రెండు లాలిపాప్ లు ఇచ్చెసరికి ఏడుపు ఆపేసింది.

ఇప్పుడు మా బుడంకాయ్ పెరిగి పెద్దయ్యి ఇంకా బాగా మాటలు నేర్చింది. అయిన ఎప్పుడైనా చిన్న పిల్లలని, అల్లరి పిల్లల్ని చుస్తే, మా బుడంకాయ్ చేసిన అల్లరే గుర్తొస్తుంది.


౼౼౼ శ్రీ ౼౼౼

Comments

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

సీతాకోకచిలుక

(సరదా కి) Guide to youngsters whose parents have smartphones