(సరదా కి) Guide to youngsters whose parents have smartphones



1. మీ పేరెంట్స్ ఫోన్ లో ఫేస్బుక్ ఆప్ ని డిలీట్ చేసేయండి. ఒకవేళ మీ నాన్న/అమ్మ కి ఆల్రెడీ ఫేస్బుక్ లో అకౌంట్ ఉంటే మీరు మాత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకండి. మీ నాన్న/అమ్మ ఆల్రెడీ మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే మాత్రం ఆ దేవుడే మిమ్మల్ని కాపాడగలడు.

2. మీకు ఇష్టం వచ్చిన హీరోయిన్, మీ గర్ల్ ఫ్రెండ్/ బాయ్ ఫ్రెండ్ పిక్స్, మీ ఫ్రెండ్స్ తో కలిసి మందు కొడుతున్న పిక్స్, ఇంకేదైన పిచ్చి పిచ్చి బొమ్మలు డీపీ లు గా పెట్టడం మానుకోండి. లేదంట తరువాతే మీరే బాధపడాల్సి వస్తుంది.

3. రోజులో కనీసం ఒకసారైనా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. లేకపోతే ఎప్పుడో ఒకసారి.. " రోజుకు ఒక మెసేజ్ కూడా పెట్టవు, ఏంట్రా అంత బిజీ, వెధవన్నర వెధవ?" అనే ప్రమాదం ఉంది.

4. ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు దేవుడి ఫోటో లు, మంచి కోటషన్స్ ఫార్వర్డ్ చేయండి. మీ ఆరోగ్యానికి మంచిది.

5. "ఈ మెసేజ్ పది మందికి ఫార్వర్డ్ చెయండి. మీకు మంచి జరుగుతుంది. చేయకపోతే మీరు ఢమాల్.." లాంటి పిచ్చి పిచ్చి మెసేజ్ లు ఇంట్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేయకండి.

6. ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో మీ పేరెంట్స్ ఉంటే, అమ్మాయిల ఫోటోలకి కామెంట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి లేదంటే త్వరగా పెళ్లి చేసుకోడానికి రెడీ గా ఉండండి.

7. తప్పదు అనుకుంటే గానీ, వీడియో కాల్ ఎలా చేయాలో మాత్రం నేర్పకండి. నేర్పిస్తే మాత్రం, అన్నివేళలా అలెర్ట్ గా ఉండడం అలవాటు చేసుకోండి.

8. పండుగలకు పబ్బాలకి గుడికి వెళ్లి ఓ రెండు సెల్ఫీలు తీస్కొని ఇంట్లోవాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సింగల్ టేక్ లో రెండు సినిమాలు. ఇటు దేవుడుని, అటు పేరెంట్స్ ని మెప్పించే అవకాశం.

9. ఆప్స్, బ్రౌజర్స్ లో వచ్చే పాడు లింక్స్ క్లిక్స్ చేస్తే జరిగే ప్రమాదం మోహమాటనికి పోకుండా ముందే చెప్పండి. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయ్.

10. ఏదైనా మెసేజ్/ఇమేజ్ ఫార్వర్డ్ చేసేముందు చూసుకొని ఫార్వర్డ్ చేయండి. ఎక్కడికో వెళ్లాల్సిన మెసేజ్ ఇంట్లో వాళ్ళకి వెళ్తే, సీను సితారే. తర్వాత మీరు ఇంకెక్కడికో వెళ్లాల్సొస్తుంది.

11. కెమెరా, ఫ్లాష్ లైట్, గేలరీ, కాలిక్యులేటర్ లాంటి బేసిక్ ఆప్స్ ని ఓపికగా వివరించండి. లేకపోతే తరువాత ఎదో ఒకసారి అదెలా ఇదెలా అని ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లో వివరంగా చెప్పడానికి మీ తోక ప్రాణం అరికాల్లోకి వస్తుంది.


ఇంకా చాలా ఉన్నాయి గాని రాసే సమయానికి గుర్తురావట్లేదు. మీకు గుర్తొచ్చినవి, అనుభవించినవి కామెంట్స్ పెట్టండి. టపా కు అతికిస్తాను.

వెనుకమాట( ముందు మాట కి వ్యతిరేకపదం): ఈ పోస్ట్ ఎవర్ని కించపరచడానికికాదు. జస్ట్ ఫర్ ఫన్. 



౼౼౼ శ్రీ ౼౼౼

Comments

  1. very funny...
    4. ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు దేవుడి ఫోటో లు, మంచి కోటషన్స్ ఫార్వర్డ్ చేయండి. మీ ఆరోగ్యానికి మంచిది. -- completely agree on this one.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏ మాయ చేసావే.. !?

పొట్టి బుడంకాయ్!