పొట్టి బుడంకాయ్!

దానికిఅప్పుడు మూడేళ్ళు ఉండేవనుకుంట. మా పెద్దమ్మ కూతురు. చిన్ని అని పిలిచే వాళ్ళం మేమంతా. నేను మాత్రం పొట్టి బుడంకాయ్ అనేవాణ్ణి. మహా పెంకి పిల్ల. ముళ్ళపూడి గారి 'బుడుగు' లేడీ వెర్షన్. అందుకనే ఆ పేరు పెట్టా. అదిగాని నోరు తెరిచిందంటే మేమంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. తెలుగు లో రైమ్స్ నేర్చుకుంది కొత్తగా. ఉంటాయి గా, చిన్నపిల్లల రైమ్స్ ఏవో. చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టింద, ఛుక్ ఛుక్ రైలు వస్తోంది... అవీ ఇవీ. ఇంటికి ఎవరొచ్చినా పాపం బుడ్డది ఇవన్ని చెప్పాల్సిందే. చెప్పేదాకా మా పెద్దమ్మ వదిలేది కాదు. అప్పుడప్పుడు రూపాయి బిళ్ళ లంచం ఇవ్వాల్సోచ్చేది. లేకపోతె వాళ్ళమ మొట్టికాయ ఒకటిచ్చేది. ఏది ఏమైనా వచ్చిన వాళ్ళకి రైమ్స్ వినిపించాల్సిందే. ప్లే స్కూల్ లో ఆడుకుంటూ చెమ్మ చెక్క చేరాడేసి మొగ్గ పాటని నేర్చుకుంది కొత్తగా. దానికి ఆ పాట బాగా నచినట్టుంది. ఎవరు కనిపించినా..అడిగినా అడక్కపోయినా...చేప్పేసేది. భలే ముద్దు గా చెప్తోంది కదా.. ఏది నాకు చెప్పమ్మా అన్నాను. చెమ్మా చెక్కా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్మా చెక్కా... చేరడేసి మొగ్గా... చెమ్...